మహేష్ బాటలో తనయుడు గౌతమ్

సూపర్ స్టార్ మహేష్ బాబు సమాజానికి ఎంత సేవలు చేస్తాడో అందరికీ తెలిసిందే. ముఖ్యంగా హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్న చిన్నారులందరికీ ఉచితంగా సర్జరీస్ చేయిస్తూ ఇప్పటి వరకూ ఎంతోమంది జీవితాల్లో వెలుగులు నింపాడు.

ఎమ్.బి ఫౌండేషన్ పేరుతో మొదలైన ఈ సేవా కార్యక్రమాల్లో ఏ ఒక్కరి నుంచీ రూపాయి కూడా తీసుకోకుండా ప్రతి ఖర్చునూ తనే భరిస్తూ.. తను రీల్ లైఫ్ లోనే కాదు.. రియల్ లైఫ్ లోనూ సూపర్ స్టార్ అనిపించుకున్నాడు. అయితే తాజాగా ఆయన భార్య నమ్రత పెట్టిన చేసిన ఒక ఇన్ స్టా పోస్ట్ వైరల్ గా మారింది. ఇది చూసిన ప్రతి ఒక్కరూ శెభాష్ గౌతమ్ అంటున్నారు.


యస్.. తండ్రి బాటలోనే ఆయన తనయుడు గౌతమ్ కూడా తన స్కూల్ తర్వాత తమ ఫౌండేషన్ ద్వారా సర్జరీలు జరిగే రెయిన్ బో హస్పిటల్స్ కు వెళ్లి అక్కడి పేషెంట్స్ ను పరామర్శిస్తుంటాడట. అలా తాజాగా అతను పరామర్శకు వెళ్లిన ఒక పోస్ట్ నే నమ్రత షేర్ చేసింది.

ఈ పోస్ట్ చూడగానే తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకున్నాడు గౌతమ్. సర్జరీ చేయించుకోవడానికి వచ్చిన ఓ పిల్లాడితో ముచ్చటిస్తూ కనిపించాడు గౌతమ్. అలాగే వారికి సంబంధించిన వివరాలను కూడా హాస్పిటల్ సిబ్బందిని అడిగి నిత్యం తెలుసుకుంటూ ఉంటాడట. ఈ వయసులోనే ఇంత గొప్ప మనసును కలిగి ఉండటం తల్లిదండ్రులుగా వారూ గర్వించే అంశం అవుతుంది.


విశేషం ఏంటంటే.. మహేష్ బాబు ఈ సేవా కార్యక్రమాలు మొదలుపెట్టిందే గౌతమ్ వల్ల. అతను పుట్టినప్పుడు తలెత్తిన ఆరోగ్య సమస్యలు చూసి తల్లడిల్లిపోయాడు మహేష్. తన వద్ద డబ్బుంది కాబట్టి బ్రతికించుకున్నాడు. లేని వారి పరిస్థితి ఏంటీ..? తనలా మరే తల్లిదండ్రులూ బాధపడొద్దనే ఆలోచన నుంచి పుట్టిందే ఈ ఎమ్.బి ఫౌండేషన్. మొత్తంగా తన కొడుకు చేసిన పనికి తల్లిగా నమ్రత ఎంత మురిసిపోతుందో.. ఎంత గర్వపడుతుందో ఈ పోస్ట్ తెలియజేస్తుంది.

Related Posts