ప్రైవేట్ ఫంక్షన్ లో పెద్దోడు-చిన్నోడు

విక్టరీ వెంకటేష్, సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ మంచి విజయాన్ని సాధించింది. చాలా సంవత్సరాల తర్వాత తెలుగులో వచ్చిన మల్టీస్టారర్ ఇది. ఈ సినిమాలో వీరిద్దరినీ పెద్దోడు, చిన్నోడుగానే సంబోధిస్తారు. ఆ తర్వాత బయట కూడా వీళ్లు కలిసినప్పుడల్లా పెద్దోడు, చిన్నోడుగా అభివర్ణించడం ఆనవాయితీగా మారింది.

గతంలో సంక్రాంతి కానుకగా ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ వస్తే.. ఇప్పుడు వీరిద్దరూ సోలో హీరోస్ గా నటించిన ‘గుంటూరు కారం, సైంధవ్’ సినిమాలు సంక్రాంతి బరిలో పోటీపడుతున్నాయి. ఈ సందర్భంగా.. ఆమధ్య ‘సైంధవ్’ ప్రెస్ మీట్ లో వెంకీ.. చిన్నోడు సినిమాపై ఆసక్తికర వ్యాఖ్యాలు చేశాడు. పెద్దోడు నటించిన ‘సైంధవ్’ ఆడుతోంది? చిన్నోడు నటించిన ‘గుంటూరు కారం’ కూడా సూపర్ హిట్ అవుతోంది అంటూ జోస్యం చెప్పాడు.

లేటెస్ట్ గా పెద్దోడు, చిన్నోడు ఓ ప్రైవేట్ ఈవెంట్ లో మెరిశారు. ఓ పారిశ్రామికవేత్తకు సంబంధించిన క్లబ్ హౌస్ ను ప్రారంభించే వేడుకలో వీరిద్దరూ కలిశారు. అక్కడ ఇద్దరూ సరదాగా పేకాట ఆడుతున్న ఫోటోలు లీకై నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. ఈ పిక్స్ లో వెంకీ, మహేష్ హ్యాండ్సమ్ లుక్స్ లో మెరిసిపోతున్నారు.

Related Posts