‘మహారాజ’ మంచి హిట్ కొట్టింది

ఒకప్పుడు తమిళం నుంచి తెలుగులోకి వచ్చిన అనువాదాలు కొన్ని.. ఇక్కడ స్ట్రెయిట్ మూవీస్ కి మిన్నగా ఆడిన సందర్భాలున్నాయి. ఆ విధంగానే రజనీకాంత్, కమల్ హాసన్, విక్రమ్, సూర్య, కార్తీ వంటి వారికి ఇక్కడ స్టార్‌డమ్ దక్కింది. మళ్లీ చాన్నాళ్లకు తెలుగులో ఓ డబ్బింగ్ బొమ్మకి మంచి రెస్పాన్స్ వస్తోంది. ఆ చిత్రమే ‘మహారాజ’.

ఇప్పటివరకూ తెలుగు చిత్ర పరిశ్రమపై పెద్దగా ఫోకస్ పెట్టని విలక్షణ నటుడు విజయ్ సేతుపతి నటించిన సినిమా ఇది. ‘మహారాజ’ విషయంలో విజయ్ సేతుపతికి ముందు నుంచి గట్టి నమ్మకం ఉంది. పైగా.. ఇది అతని 50వ చిత్రం. ఎప్పుడూ లేని విధంగా ఈ సినిమాకోసం తెలుగు నాట ఓ రేంజులో పబ్లిసిటీ కూడా చేశాడు. అదే ఇక్కడ ‘మహారాజ’కి బాగా కలిసొచ్చింది.

గత శుక్రవారం విడుదలైన చిత్రాలలో సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది ‘మహారాజ’. తెలుగు నాట పలు థియేటర్లలో హౌస్‌ఫుల్ కలెక్షన్స్ తో దూసుకెళ్తుంది. లాంగ్ వీకెండ్ కలిసి రావడంతో ‘మహారాజ’కి మరింత అడ్వాంటేజ్ గా మారనుంది. స్క్రీన్‌ప్లే ప్రధానంగా సాగే ఈ సినిమాతో డైరెక్టర్ నిథిలన్‌ స్వామినాథన్‌ సిల్వర్‌స్క్రీన్‌పై మ్యాజిక్ చేశాడు. ‘మహారాజ’ని కామన్ ఆడియన్స్ మాత్రమే కాదు.. సెలబ్రిటీలు సైతం వీర లెవెల్ లో మెచ్చుకుంటూ సోషల్ మీడియాలో ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

Related Posts