‘లవ్ మౌళి‘ ట్రైలర్.. నాలుగున్నర నిమిషాల రొమాంటిక్ జర్నీ

కాస్త గ్యాప్ తర్వాత నవదీప్ హీరోగా నటించిన చిత్రం ‘లవ్ మౌళి‘. ఏప్రిల్ 19న విడుదలకు ముస్తాబవుతోన్న ఈ మూవీని శ్రీకర స్టూడియోస్ సమర్పణలో C స్పేస్, నైరా క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని నవదీప్ ‘లవ్ మౌళి‘ ట్రైలర్ రిలీజ్ చేసింది టీమ్. దాదాపు నాలుగున్నర నిమిషాల నిడివితో విడుదలైన ఈ ట్రైలర్ రొమాంటిక్ గా ఆకట్టుకుంటుంది.

నవదీప్ ఇప్పటివరకూ చేయనటువంటి ఓ ప్రయోగాత్మకమైన పాత్ర ‘మౌళి‘గా ఈ చిత్రంలో కనిపించబోతున్నాడు. ఈ మూవీలో ఓ పెయింటర్ గా కనిపించబోతున్నాడు నవదీప్. అతని జీవితంలోకి వచ్చిన అమ్మాయిలు.. వారితో అతని రొమాంటిక్ జర్నీ ఎలా సాగిందన్నదే ‘లవ్ మౌళి‘లో ఆవిష్కరించినట్టు ట్రైలర్ ను బట్టి తెలుస్తోంది. ఈ సినిమాలో నవదీప్ కి జోడీగా పంఖూరి గిద్వాని నటించింది. అవనీంద్ర దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకి గోవింద్ వసంత సంగీతాన్ని సమకూరుస్తున్నాడు.

Related Posts