‘భారతీయుడు 2‘ నుంచి మొదటి పాట ‘శౌరా‘ విడుదల

విశ్వనటుడు కమల్ హాసన్, గ్రేట్ డైరెక్టర్ శంకర్ కలయికలో రాబోతున్న చిత్రం ‘భారతీయుడు 2‘. క్లాసిక్ మూవీ ‘భారతీయుడు‘కి సీక్వెల్ గా రాబోతున్న చిత్రమిది. తాజాగా ‘భారతీయుడు 2‘ నుంచి ఫస్ట్ సాంగ్ రిలీజైంది. ‘శౌరా‘ అంటూ భారతీయుడు గొప్పదనాన్ని తెలిపే గీతంగా ఈ పాటను తీర్చిదిద్దాడు మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్. ఈ ట్యూన్ ఎంత పవర్ ఫుల్ గా ఉందో.. అంతే స్థాయిలో ఈ పాటకు లిరిక్స్ అందించారు లిరిసిస్ట్ సుద్దాల అశోక్ తేజ. రితేజ్ జి.రావు, శ్రుతిక సముద్రాల ఈ పాటను ఆలపించారు.

‘భారతీయుడు‘ సినిమాలోని ప్రీ ఇండిపెండెన్స్ బ్యాక్ డ్రాప్ లో కొన్ని సన్నివేశాలు చిత్రీకరించాడు డైరెక్టర్ శంకర్. ఇక.. సీక్వెల్ లోనూ బ్రిటీష్ ఇండియా కాలానికి సంబంధించిన ఎపిసోడ్స్ ఉండబోతున్నట్టు ఈ పాట లిరికల్ వీడియో చూస్తే అర్థమవుతోంది. భారతీయుడు గుర్రంపై దౌడు తీస్తున్న యానిమేటెడ్ విజువల్స్ ఈ లిరికల్ సాంగ్ కి స్పెషల్ అట్రాక్షన్. జూన్ 1న ‘భారతీయుడు 2‘ ఆడియో ని గ్రాండ్ లెవెల్ లో రిలీజ్ చేయబోతున్నారు. జూలై 12న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తోంది.

Related Posts