‘కల్కి‘ ఫస్ట్ డే కలెక్షన్స్ రూ.191.5 కోట్లు

రెబెల్ స్టార్ ప్రభాస్ ‘కల్కి 2898 AD‘ వరల్డ్ వైడ్ గా బాక్సాఫీస్ ను షేక్ చేస్తోంది. తొలిరోజు ప్రపంచవ్యాప్తంగా ‘కల్కి‘ చిత్రం రూ.191.5 కోట్లు గ్రాస్ ను వసూలు చేసింది. ఈ కలెక్షన్లను నిర్మాణ సంస్థ వైజయంతీ మూవీస్ అధికారికంగా ప్రకటించింది. తెలుగు రాష్ట్రాలతో పాటు.. ‘కల్కి‘ చిత్రం కర్ణాటక, తమిళనాడు, కేరళ రాష్ట్రాలలో భారీ స్థాయిలో విడుదలైంది.

ఉత్తరాదిన సైతం ‘కల్కి‘ బాక్సాఫీస్ ను ఊపేస్తోంది. ఓవర్సీస్ లెక్కలు గురించి చెప్పక్కర్లేదు. అక్కడ 5 మిలియన్ల డాలర్లను దాటేశాయి. మొత్తంమీద.. గత జూన్ లో ‘ఆదిపురుష్‘ నుంచి ఈ జూన్ లో ‘కల్కి‘ వరకూ ఏడాది కాలంలోనే మూడు సినిమాలను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చాడు ప్రభాస్. ‘ఆదిపురుష్‘తో బాక్సాఫీస్ వద్ద తొలిరోజు రూ.140 కోట్లు కలెక్షన్లను కొల్లగొట్టిన రెబెల్ స్టార్.. డిసెంబర్ లో వచ్చిన ‘సలార్‘తో ఫస్ట్ డే రూ.178 కోట్లు వసూళ్లు సాధించాడు. ఇప్పుడు ఆ రెండు చిత్రాలకు మిన్నగా ‘కల్కి‘తో ఏకంగా ఫస్ట్ డే రూ.191.5 కోట్లు సాధించడం టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అయ్యింది.

Related Posts