‘బచ్చల మల్లి‘గా మాస్ లుక్ లో అల్లరి నరేష్

రొటీన్ కమర్షియల్ మూవీస్ కి కాలం చెల్లింది. సినిమాలో ఏదో కొత్తదనం ఉంటేనే కానీ.. ప్రేక్షకులు థియేటర్లకు రావడం లేదు. అందుకే.. మన కథానాయకులు సరికొత్త కథాంశాల కోసం కసరత్తులు చేస్తున్నారు. సిల్వర్ స్క్రీన్ పై గతంలో తాము చేయనటువంటి పాత్రలను ఎంపిక చేసుకుంటున్నారు. ఈ లిస్టులో చెప్పుకోవాల్సిన హీరోల్లో అల్లరి నరేష్ ఒకడు.

కొంత కాలంగా కామెడీని పక్కనపెట్టి సీరియస్ రోల్స్ పై స్పెషల్ ఫోకస్ పెట్టిన అల్లరోడు.. లేటెస్ట్ గా ‘బచ్చల మల్లి‘ అనే సినిమాతో వస్తున్నాడు. గోదావరి జిల్లాలలో జరిగిన వాస్తవ సంఘటనల ఆధారంగా ఈ చిత్రాన్ని సుబ్బు మంగాదేవి తెరకెక్కిస్తున్నాడు. ఈరోజు అల్లరి నరేష్ పుట్టినరోజు సందర్భంగా ఈ మూవీ నుంచి ఫస్ట్ గ్లింప్స్ రిలీజ్ చేసింది టీమ్. ఈ గ్లింప్స్ లో బచ్చల మల్లిగా ఊర మాస్ లుక్ లో మెస్మరైజ్ చేస్తున్నాడు నరేష్. అతని మేకోవర్, స్వాగ్ సరికొత్తగా ఉన్నాయి. అల్లరి నరేష్ కి జోడీగా అమృత అయ్యర్ నటిస్తుంది. హాస్య మూవీస్ బ్యానర్ పై రాజేష్ దండా నిర్మిస్తున్న ఈ సినిమాకి విశాల్ చంద్రశేఖర్ సంగీతాన్ని సమకూరుస్తున్నాడు.

Related Posts