ఓటీటీ లోకి విజయ్ సేతుపతి ‘మహారాజ‘

చాలా కాలం తర్వాత ఓ అనువాద సినిమా తెలుగు ప్రేక్షకుల్ని విపరీతంగా ఆకట్టుకుంది. అదే.. ‘మహారాజ‘. విలక్షణ నటుడు, కోలీవుడ్ మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి నటించిన 50వ చిత్రమిది. రివెంజ్ డ్రామాగా నిథిలన్‌ స్వామినాథన్‌ ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. మాతృ భాష తమిళంతో పాటు.. తెలుగులోనూ ‘మహారాజ‘ని బాగా ప్రమోట్ చేశాడు హీరో విజయ్ సేతుపతి.

పబ్లిసిటీతో జనాల్లోకి వెళ్లిన ‘మహారాజ‘ విడుదల తర్వాత సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రాన్ని కొన్న బయ్యర్స్ కు భారీగా లాభాలు తెచ్చిపెట్టింది. విజయ్ సేతుపతితో పాటు.. ఇతర కీలక పాత్రల్లో నటించిన అనురాగ్‌ కశ్యప్‌, మమతా మోహన్‌దాస్‌, నటరాజ్‌, భారతీరాజా, అభిరామి పాత్రలకు మంచి రెస్పాన్స్ దక్కింది. అజనీష్ లోక్ నాథ్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఈ మూవీకి మరో ప్లస్. మొత్తానికి.. జూన్ 14న థియేటర్లలోకి వచ్చిన ‘మహారాజ‘.. జూలై 19 నుంచి ఓటీటీ ప్లాట్ ఫామ్ నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కి రానుందట.

Related Posts