జూలైలో వస్తోన్న విజయ్ ఆంటోని ‘తుఫాన్‘

మాతృ భాష తమిళంతో పాటు తెలుగులోనూ మంచి పాపులారిటీ సంపాదించుకున్న కథానాయకుడు విజయ్ ఆంటోని. కథకే ఎక్కువ ప్రాధాన్యతనిస్తూ విజయ్ ఆంటోని నటించిన సినిమాలకు తెలుగులోనూ మంచి ఆదరణ దక్కుతోంది. ఇక.. ‘బిచ్చగాడు 2‘ వంటి విజయం తర్వాత విజయ్ ఆంటోని నుంచి తెలుగు ప్రేక్షకుల ముందుకొస్తున్న సినిమా ‘తుఫాన్‘. మేఘా ఆకాశ్ హీరోయిన్ గా నటించిన ఈ మూవీలో సత్యరాజ్, శరత్ కుమార్, మురళీ శర్మ, శరణ్య ఇతర కీలక పాత్రలు పోషించారు. ఇన్ఫినిటీ ఫిల్మ్స్ బ్యానర్ పై విజయ్ మిల్టన్ దర్శకత్వం వహించిన ‘తుఫాన్‘ ట్రైలర్ రిలీజయ్యింది.

తనకు ఎవరూ తెలియని ఒక ప్రాంతానికి వెళతాడు హీరో విజయ్ ఆంటోని. అక్కడ వారు చూపిస్తోన్న ప్రేమ, ఆప్యాయతలకు ఫిదా అవుతాడు. కానీ.. వారితో తన ఐడెంటిటీని పంచుకోవడానికి మాత్రం నిరాకరిస్తుంటాడు. అసలు విజయ్ ఆంటోని ఎవరు? అతని మిషన్ ఏంటి? వంటివి ఈ ట్రైలర్ లో ఆసక్తికరంగా ఉన్నాయి. జూలై నెలలో ‘తుఫాన్‘ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

Related Posts