మొదటి రోజు అదరగొట్టిన జైలర్

సూపర్ స్టార్ రజినీకాంత్ లేటెస్ట్ మూవీ జైలర్ మొదటి రోజు కలెక్షన్స్ పరంగా అదరగొట్టింది. నెల్సన్ దిలీప్ కుమార్ డైరెక్ట్ చేసిన ఈ మూవీకి ప్రపంచ వ్యాప్తంగా మంచి టాక్ వచ్చింది. సెకండ్ హాఫ్‌ ఇంకాస్త బెటర్ గా ఉంటే ఎన్నో రికార్డులు కొల్లగొట్టేదీ అనే టాక్ కూడా అంతటా వినిపించింది. బట్ ఫస్ట్ హాఫ్ తో సూపర్ స్టాను నెల్సన్ డీల్ చేసిన విధానానికి మళ్లీ వింటేజ్ రజినీకాంత్ ను చూశారు ఆడియన్స్. సెకండ్ హాఫ్ యావరేజ్ అయినా మళ్లీ ప్రీ క్లైమాక్స్ నుంచి పికప్ అయింది. ఇక మోహన్ లాల్, శివరాజ్ కుమార్ స్క్రీన్ ప్రెజెన్స్ కు థియేటర్స్ దద్దరిల్లిపోయాయి. తమన్నా, సునిల్ ట్రాక్ లేకపోతే ఇంకాస్త బావుండేది అనే టాక్ వినిపించడం మాత్రం దర్శకుడి లోపమే.

అంటే ఆ ట్రాక్ ను ఇబ్బంది లేకుండా చూసుకుని ఉంటే ఇంకా బావుండేదన్నమాట. ఏమైతేనే దాదాపు పదేళ్ల తర్వాత రజినీకాంత్ నుంచి ఫ్యాన్స్ ఎక్స్ పెక్ట్ చేసిన మూవీ వచ్చింది. హిట్ టాక్ రావడంతో ఫస్ట్ డే సెంచరీకి అతి దగ్గరగా వచ్చి బాక్సాఫీస్ ను షేక్ చేసింది జైలర్. విశేషం ఏంటంటే.. ఇందులో మేజర్ షేర్ ఓవర్శీస్ నుంచి రావడం.

జైలర్ కలెక్షన్స్ లాంగ్వేజ్ వారీగా చూసుకుంటే

తమిళనాడు – 26 కోట్లు
కర్ణాటక – 11.85 కోట్లు
కేరళ – 5.85 కోట్లు
తెలుగు స్టేట్స్ – 12 కోట్లు
ఇతర భాషల నుంచి – 3 కోట్లు
ఓవర్శీస్ నుంచి – 40 కోట్లు
టోటల్ గా – 98.70 కోట్లు.

అయితే ఇదంతా గ్రాస్. షేర్ గా చూసుకుంటే 55 కోట్ల వరకూ ఉంటుంది. అలా చూసినా డే వన్ అదరగొట్టినట్టుగానే చెప్పాలి. ఇక తెలుగులో మెగాస్టార్ భోళా శంకర్ తేలిపోయింది. ఇది జైలర్ కు మరింత ప్లస్ అవుతుంది. అటు ఓవర్శీస్ లో కూడా ఇదే కనిపించే అవకాశం ఉంది. మొత్తంగా రజినీకాంత్ చాలా రోజుల తర్వాత బ్లాక్ బస్టర్ కొట్టేసినట్టే అని చెప్పాలి.

Related Posts