HomeMoviesటాలీవుడ్'జై హనుమాన్' ప్రీ ప్రొడక్షన్ పనులు ప్రారంభం!

‘జై హనుమాన్’ ప్రీ ప్రొడక్షన్ పనులు ప్రారంభం!

-

‘హనుమాన్’ సినిమా ఇంకా థియేటర్లలో ఆడుతూనే ఉంది. వరల్డ్ వైడ్ గా వసూళ్ల వర్షం కురిపిస్తూనే ఉంది. ఇదిలావుంటే తాజాగా ఈ చిత్రానికి సీక్వెల్ గా తెరకెక్కే ‘జై హనుమాన్’కి సంబంధించి ప్రీ ప్రొడక్షన్ పనులు ప్రారంభించాడు డైరెక్టర్ ప్రశాంత్ వర్మ. అయోధ్యలో రామ మందిర్ ప్రాణ ప్రతిష్ట జరిగిన సందర్భాన్ని పురస్కరించుకుని.. ఇంతకంటే ‘జై హనుమాన్’ మూవీ పనులను ప్రారంభించడానికి అద్భుతమైన రోజు ఉండదని భావించి.. ఈ సినిమా పనులను ప్రారంభించిందట టీమ్.

‘హనుమాన్’ సినిమా చివరిలో ‘జై హనుమాన్’ చిత్రానికి సంబంధించి లీడ్ ఇచ్చాడు డైరెక్టర్ ప్రశాంత్ వర్మ. సీక్వెల్ లో హనుమంతు పాత్రలో తేజ సజ్జ కూడా ఉంటాడు. కానీ.. హనుమాన్ రోలే సినిమాలో మెయిన్ హీరో అట. ఆ పాత్ర కోసం ఓ పెద్ద హీరోనే తీసుకోనున్నాడట ప్రశాంత్ వర్మ. అలాగే.. సీక్వెల్ లో శ్రీరాముడుగా మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తాడనే ప్రచారం కూడా ఉంది. ఇక.. ‘జై హనుమాన్’ సినిమాని భారీ బడ్జెట్ తో బిగ్ కాన్వాస్ పై తెరకెక్కించనున్నారట. త్వరలోనే.. ‘జై హనుమాన్’లో నటించే నటీనటులపై ఓ క్లారిటీ రానుంది.

ఇవీ చదవండి

English News