భారీ బడ్జెట్ తో రూపొందే సినిమాలకు సంబంధించిన ఆఫీసులపై ఐ.టి. దాడులు జరగడం ఈమధ్య ఎక్కువగా జరుగుతుంది. ఆయా సినిమాలకు సంబంధించిన విడుదలకు తేదీలకు ముందు ఐ.టి. అధికారులు ఆ ఆఫీసులపై దాడులు చేస్తున్నారు. తాజాగా ‘టైగర్ నాగేశ్వరరావు‘ సినిమా ఆఫీసుపై ఐ.టి. దాడులు జరిగాయి.
‘కశ్మీర్ ఫైల్స్, కార్తికేయ 2‘ వంటి సినిమాలతో పాన్ ఇండియా లెవెల్ లో సెన్సేషనల్ హిట్స్ అందుకున్న అభిషేక్ అగర్వాల్ ‘టైగర్ నాగేశ్వరరావు‘ సినిమాని నిర్మిస్తున్నారు. భారీ బడ్జెట్ తో రూపొందిన ఈ సినిమాకి సంబంధించిన లెక్కలు, జీఎస్టీ కి సంబంధించిన విషయాలపై ఐ.టి. అధికారులు దష్టిపెట్టినట్టు తెలుస్తోంది.
దసరా కానుకగా అక్టోబర్ 20న పాన్ ఇండియా లెవెల్ లో ‘టైగర్ నాగేశ్వరరావు‘ విడుదలకు ముస్తాబయ్యింది. రవితేజ నటించిన ఫస్ట్ పాన్ ఇండియా మూవీ ఇది. ఈ సినిమాకోసం చిత్రబృందం జోరుగా ప్రమోషన్ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి.
ముఖ్యంగా ముంబై వేదికగా జరిగిన పలు కార్యక్రమాల్లో ‘టైగర్ నాగేశ్వరరావు‘ని భారీగా ప్రమోట్ చేసింది చిత్రబృందం.