వంద మిలియన్ల వ్యూస్ కొల్లగొట్టిన ‘హుకుం’

యూట్యూబ్ లో వంద మిలియన్ల వ్యూస్ ను కొల్లగొట్టిన గీతాలు చాలానే ఉన్నాయి. అయితే.. గడిచిన కొన్ని నెలల్లో ఇలాంటి ఫీట్ సాధించిన పాటలను వేళ్లమీద లెక్కపెట్టొచ్చు. ఈమధ్య కాలంలో మళ్లీ పాటల్లో ఓ ఊపు తీసుకొచ్చి యూట్యూబ్ ని షేక్ చేసిన మూవీగా ‘జైలర్’ నిలిచింది. ఈ సినిమాలోని ‘కావాలా’ తమిళ లిరికల్ సాంగ్ 218 మిలియన్ల వ్యూస్ ను సాధించింది. ఇదే పాట వీడియో సాంగ్ 100 మిలియన్ల వ్యూస్ దాటేసింది.

ఇక.. లేటెస్ట్ గా ‘జైలర్’ నుంచి సూపర్ స్టార్ టైటిల్ సాంగ్ ‘హుకుం’ కూడా 100 మిలియన్ల వ్యూస్ క్లబ్ లో చేరింది. మ్యూజికల్ రాక్ స్టార్ అనిరుధ్ స్వరపరిచి.. తానే ఈ పాటను ఆలపించాడు. నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో రూపొందిన ‘జైలర్’ మూవీతో రజనీకాంత్ సూపర్ ఫామ్ లోకి వచ్చాడు. వరల్డ్ వైడ్ గా ఈ మూవీ రూ.650 కోట్లు కొల్లగొట్టింది. మరోవైపు.. రజనీకాంత్ కేమియోలో మురిపించబోతున్న ‘లాల్ సలామ్’ నుంచి ఈనెల 12న టీజర్ రిలీజ్ చేయబోతున్నారు. రజనీకాంత్ పెద్ద కుమార్తె ఐశ్వర్య డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీ పొంగల్ బరిలో విడుదలకు ముస్తాబవుతోంది.

Related Posts