హన్సిక నన్ను ముట్టుకోనివ్వలేదు.. కానీ

హీరోయిన్ గా తెలుగులో కెరీర్ మొదలుపెట్టి తమిళ్ లో స్టార్డమ్ తెచ్చుకుంది హన్సిక మోత్వాని. అప్పుడప్పుడూ తెలుగులోనూ మెరిసినా.. ఇక్కడ తను ఎక్స్ పెక్ట్ చేసిన రేంజ్ రాలేదు. ఇక ఇప్పటికే 50 సినిమాలకు పైగా నటించిన హన్సిక తమిళ్ లోఅప్పుడప్పుడూ హీరోయిన్ సెంట్రిక్ మూవీస్ కూడా చేస్తూ ఆకట్టుకుంటోంది.

ప్రస్తుతం తను ఆది పినిశెట్టి సరసన ఓ సినిమాలో నటించింది. ఇది కూడా ఫీమేల్ సెంట్రిక్ మూవీనే. అయితే ఈ సినిమాకు సంబంధించిన ఓ ప్రెస్ మీట్ లో మరో నటుడు రోబో శంకర్ హన్సికపై అనుచితమైన కమెంట్స్ చేశాడు. దీంతో ఇది పెద్ద కాంట్రవర్శీకి దారి తీసింది. సోషల్ మీడియాలో రోబో శంకర్ ను నెటిజన్స్ విమర్శిస్తున్నారు. అతను హన్సికపై కామెంట్స్ చేసినప్పుడు ఆ వేదికపై ఆమె కూడా ఉండటం విశేషం.


ఇంతకీ అతనేమన్నాడంటే.. ‘ ఒక సీన్ లో తను హన్సిక కాళ్లను టచ్ చేయాలి. కానీ అందుకు హన్సిక అస్సలు ఒప్పుకోలేదు. కనీసం తాకడానికి కూడా ఒప్పుకోలేదు. అదే హీరో ఆది పినిశెట్టి మాత్రం ఆమెను ఎక్కడైనా తాకడానికి పర్మిషన్ ఇచ్చింది. హీరోలుగా ఉంటే ఉండే అడ్వాంటేజ్ ఇదే.

హీరోయిన్లను ఎక్కడైనా తాకొచ్చు. మా లాంటి వారికి మాత్రం అవకాశం ఇవ్వరు.. ” ఇదీ.. రోబో శంకర్ చెప్పిన మాట. ఈ మాటలు అంటున్నప్పుడు హన్సిక చాలా ఇబ్బందిగానే ఫీలైంది. కాకపోతే కౌంటర్ ఇవ్వలేదు.
ఇక రోబో శంకర్ తన కమెంట్స్ ను కామెడీగా తీసుకోవాలని చెప్పాడు. కానీ నెటిజన్స్ మాత్రం ఈజీగా తీసుకోలేదు. అతనిపై ఓ రేంజ్ లో ట్రోలింగ్స్ చేస్తున్నారు. ఏదేమైనా నలుగురిలో మాట్లాడుతున్నప్పుడు నాలుకను అదుపులో పెట్టుకోవాలి. లేదంటో సోషల్ మీడియాలో ట్రోలింగ్ మోత మోగుతుంది.

Related Posts