భారతీయుడు2 కోసం గ్రేట్ ఫీట్

లోక నాయకుడు కమల్ హాసన్ సినిమాల్లో భారతీయుడుకు ఎప్పటికీ ఓ ప్రత్యేక స్థానం ఉంటుంది. శంకర్ డైరెక్షన్ లో పాతికేళ్ల క్రితం వచ్చిన ఈ చిత్రానికి ఇప్పుడు సీక్వెల్ తీస్తున్నారు. రెండేళ్ల క్రితమే స్టార్ట్ అయిందీ మూవీ షూటింగ్. మధ్యలోకొన్ని ఇష్యూస్ తో ఆగిపోయింది. ఆ మధ్య తిరిగి ప్రారంభం అయింది.

భారతీయుడు2 కోసం శంకర్ ఓ గొప్ప ఫీట్ చేయబోతున్నాడు. మామూలుగా ఇండియన్ సినిమాకు టెక్నాలజీని గ్రాండ్ గా పరిచయం చేసింది శంకర్. ఆ టెక్నాలజీతోనే కొందరు ఆర్టిస్టలకు ప్రాణం పోస్తున్నాడు. ప్రాణం పోయడం అంటే వాళ్లు చనిపోయారు. వారిని తిగిరి బ్రతికిస్తున్నాడు. కాస్త ఆశ్చర్యంగా ఉన్నా.. ఇది నిజం.


భారతీయుడు సినిమా చూసిన ఎవరికైనా అందులో సిబిఐ ఆఫీసర్ పాత్రలో నటించిన నటుడుని మర్చిపోలేరు. ఆ పాత్రకు ప్రాణం పోసిన ఆ నటుడు నెడిముడి వేణు. మళయాలీ అయిన వేణు ఈ భారతీయుడు2లో కూడా ఉన్నాడు. ఆయనకు సంబందించిన కొంత పార్ట్ చిత్రీకరించారు కూడా. అయితే ఈ మధ్యే ఆయన చినిపోయారు. అలాగే మరో నటుడు వివేక్ ను కూడా ఈ చిత్రంలో తీసుకున్నారు. అతని పార్ట్ ను కూడా చాలా భాగం షూట్ చేశారట.

అయితే ఇప్పుడు వీరిని రీ ప్లేస్ చేస్తూ మరో నటులతో షూటింగ్ చేయడం కంటే టెక్నాలజీ ఆధారంగా ఆ ఇద్దరూ ఉన్నట్టుగానే రీ క్రియేట్ చేయబోతున్నాడు శంకర్. వీరి కోసం హాలీవుడ్ టెక్నాలజీని వాడబోతున్నాడట. ఇదే టెక్నాలజీతో కమల్ హాసన్ కు సంబంధించి ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ లో అతను యంగ్ గా ఉన్నట్టు కొంత భాగం రూపొందించబోతున్నారట. ఏదేమైనా చనిపోయిన ఆర్టిస్టుల పాత్రలను అర్థాంతరంగా తొలగించే చోట ఇలా వారికి లాస్ట్ ట్రిబ్యూట్ గా ఈ చిత్రంలో రీ క్రియేట్ చేయడం విశేషం అనే చెప్పాలి.

Related Posts