HomeMoviesటాలీవుడ్ఇంట్రెస్టింగ్ గా దయా ట్రైలర్

ఇంట్రెస్టింగ్ గా దయా ట్రైలర్

-

ఒక హత్య చుట్టూ అల్లుకున్న కథలు ఆకట్టుకుంటాయి. అలాంటి హత్యలు వరుసగా జరిగితే.. ఎవరు ఎందుకు చేస్తున్నారో తెలియకపోతే.. అదో సస్పెన్స్ స్టోరీ అవుతుంది. ఈ హత్యల వెనక ఉన్న అసలు విషయాన్ని కనిపెట్టే క్రమం థ్రిల్లింగ్ గా ఉంటుంది.

కాకపోతే ఈ తరహా సినిమాలకు మంచి కథతో పాటు కథనం కూడా ఇంపార్టెంట్. నెక్ట్స్ ఏం జరుగుతుందన్న ఊహ ప్రేక్షకుడికి వస్తే ఆ కథనం ఫెయిల్ అయినట్టే. అయినా ఈ జానర్ సినిమాలను చూసేవాళ్లు ఆసక్తిగానే చూస్తారు. అలాంటి కంటెంట్ తోనే వస్తున్నట్టుగా కనిపిస్తోంది దయా అనే వెబ్ సిరీస్. ఇంట్రెస్టింగ్ పాత్రలు, నటులతో రూపొందిన ఈ సిరీస్ ట్రైలర్ మాత్రం ఆకట్టుకునేలా ఉంది.


సిటీలో ఓ లేడీ జర్నలిస్ట్ అదృశ్యం అవుతుంది. తను మిస్ అయిందా లేక ఎవరైనా కిడ్నాప్ చేశారా అనేది ఒక కోణం. అలాగే ట్రైలర్ ఆరంభంలోనే “అనగనగా ఒక అడవి.. అందులో ఎన్నో ప్రాణులు. కానీ కొన్ని గుంట నక్కలు దారుణంగా వాటిమీద విరుచుకు పడుతున్నాయి”.. డైలాగ్ తో స్టార్ట్ కావడంతో ఇలాంటివి అక్కడ కామన్ అనేలా ఉన్నాయి. నెక్ట్స్ దయా అనే పాత్ర పరిచయం అవుతుంది. ఆ పాత్రలో జేడి చక్రవర్తి కనిపిస్తున్నాడు.

అతనికి నెలలు నిండిన భార్య ఉంటుంది. అతనో ఫిషర్ మెన్ డ్రైవర్. చెవులు వినిపించవు కూడా. అతను చేపలు రవణా చేసే వాహనంలో శవం దొరుకుతుంది. ఆ శవాన్ని మాయం చేసే క్రమంలో మరికొన్ని శవాలు. వీరిని వెంటాడుతూ పోలీస్ లు.. ఈ క్రమంలో రకరకాల పాత్రలు వస్తుంటాయి. మరి ఈ శవాలు ఏంటీ.. ఆ జర్నలిస్ట్ ఏమైంది.. ఈ ఫిషర్ మెన్ డ్రైవర్ పోలీస్ లకు దొరికాడా..? అనే కోణంలో ఈ సిరీస్ సాగేలా కనిపిస్తోంది. ఆగస్ట్ 4నుంచి డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమ్ కాబోతోందీ సిరీస్. అన్ని పాత్రలూ ఇంట్రెస్టింగ్ గానే ఉండటం ఈ ట్రైలర్ ప్రత్యేకత. ఆ ప్రత్యేకత సిరీస్ లో కూడా ఉంటే ఖచ్చితంగా ఆకట్టుకుటుందని చెప్పొచ్చు.

ఇవీ చదవండి

English News