పవన్ కళ్యాణ్ ను కలవనున్న టాలీవుడ్ నిర్మాతలు

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ ను.. రేపు విజయవాడ లోని క్యాంప్ ఆఫీసులో టాలీవుడ్ ప్రముఖ నిర్మాతలు కలవబోతున్నారు. కొత్తగా ఏర్పడిన కూటమి ప్రభుత్వాన్ని అభినందించి.. గత ప్రభుత్వంలో ఎదుర్కొన్న సమస్యలు వివరించి.. తెలుగు చిత్ర పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించే విధంగా సహకరించాలని పవన్ కళ్యాణ్ ను కోరనున్న నిర్మాతలు.

ముఖ్యంగా సినిమా టిక్కెట్ల రేట్ల విషయంలో వెసులుబాటు, థియేటర్ల సమస్యలు వంటి విషయాలు పవన్ కళ్యాణ్ గారితో చర్చించనున్న టాలీవుడ్ ప్రముఖ నిర్మాతలు. పవన్ కళ్యాణ్ ను కలిసే వారిలో అశ్వినీ దత్, హారిక హాసిని చినబాబు, మైత్రి మూవీ మేకర్స్ నవీన్, రవిశంకర్, సితార ఎంటర్టైన్మెంట్స్ నాగవంశీ, పీపుల్స్ మీడియా విశ్వప్రసాద్, వివేక్,తెలుగు ఫిలిం ఛాంబర్ అధ్యక్షడు దిల్ రాజు,దామోదర్ ప్రసాద్, బోగవల్లి ప్రసాద్, డి.వి.వి.దానయ్య తదితరులు ఉన్నారు.

Related Posts