మళ్లీ బిగ్ బాస్ లోకి గంగవ్వ

మై విలేజ్ షో అనే యూ ట్యూబ్ షో ద్వారా పాపులర్ అయి.. ఆ పాపులారిటీని వెండితెర వరకూ విస్తరించుకుంది గంగవ్వ.

కరీంనగర్ జిల్లాలో ఓ మారు మూల గ్రామంలో పుట్టిన గంగవ్వ అంటే తెలియని తెలుగు వారు లేరు అంటే అతిశయోక్తి కాదు. కొన్నాళ్ల క్రితం ఆమె బిగ్ బాస్ షోలోకీ ఎంటర్ అయింది. నాగార్జునతో పాటు కంటెస్టెంట్స్ అంతా ఆమెను బాగా చూసుకున్నారు.

బట్ అక్కడి ఏసి పడటం లేదని అనారోగ్యానికి గురైంది. ఊరుపై బెంగ పెట్టుకుంది. చుట్టూ మాట్లాడేవారు సరిగా లేరని బలవంతంగా షో నుంచి బయటకు వచ్చింది. అప్పుడే ఆమె పేదరికం గురించి తెలిసిన నాగార్జున ఆమెకు ఓ ఇల్లు కట్టిస్తా అని మాటిచ్చాడు. ఇచ్చిన మాట కాస్త ఆలస్యమైనా నిలబెట్టుకున్నాడు నాగ్.


ఇక ప్రస్తుతం వరుసగా తెలంగాణ ప్రాంత సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉంది గంగవ్వ. తాజాగా ఇంటింటి రామాయణం సినిమాకు సంబంధించిన ప్రెస్ మీట్ లో తెలుగు70ఎమ్ఎమ్ తో ఎక్స్ క్లూజివ్ గా తను మళ్లీ బిగ్ బాస్ లోకి వెళుతున్న విషయాన్ని స్వయంగా చెప్పింది.

అంతేకాదు.. గతంలో చేసిన తప్పులు మళ్లీ చేయను అంది. ఈ సారి బిగ్ బాస్ లో నేనేంటో చూపిస్తా అంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది. దీంతో పాటు నాగార్జున తన ఇంటి గృహ ప్రవేశానికి రాకపోవడానికి కారణాలు కూడా చెప్పింది. మొత్తంగా గంగవ్వ మళ్లీ బిగ్ బాస్ లోకి వెళుతున్నా అంటూ చేసిన వ్యాఖ్యలు మాత్రం సెన్సేషన్ అయ్యాయి. మరి నిజంగా ఆమెను మళ్లీ నిర్వాహాకులు ఇన్వైట్ చేశారా లేదా అలా క్యాజువల్ గా చెప్పిందా అనేది చూడాలి.

Related Posts