ఈ ప్రొడ్యూసర్.. హిట్ మెషీన్

సూర్యదేవర నాగవంశీ.. ఈ మాట వినగానే సడెన్ గా అతనెవరో అందరికీ గుర్తుకు రాకపోవచ్చు. కానీ సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ అంటే చాలు.. ఓ ప్రామిసింగ్ ప్రొడక్షన్ హౌస్ గా గుర్తొస్తుంది. ఆ ప్రామిసింగ్ అనే మాట వెనక ఉన్న వ్యక్తే ఈ సూర్యదేవర నాగవంశీ.

ఇవాళ నాగవంశీ బర్త్ డే. పెదనాన్న చినబాబు అండగా హారికి హాసిని బ్యానర్ కు తోడుగా మొదలుపెట్టిన సితార నుంచి కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్స్ ను రూపొందిస్తూ సక్సెస్ ను ఇంటి పేరుగా మార్చుకున్నాడు నాగవంశీ.

విశేషం ఏంటంటే.. తెలుగు సినిమా పరిశ్రమలో చాలామంది దర్శకులకు ద్వితీయ విఘ్నం అనేది ఒకటుంటుంది. బట్ ఏ దర్శకుడైనా రెండో సినిమాను ఈ బ్యానర్ లో చేస్తే ఆ విఘ్నాన్ని సక్సెస్ ఫుల్ గా దాటేస్తున్నారు. అందుకు నాగవంశీ ప్లానింగ్ కారణం. కాంబినేషన్స్ కంటే కథలను బలంగా నమ్మే అరుదైన నిర్మాతల లిస్ట్ లో ఈయన ఉంటాడు.

హారిక హాసిని బ్యానర్ లో కేవలం త్రివిక్రమ్ డైరెక్షన్ లోనే సినిమా చేస్తున్నారు. ఇతర దర్శకులతో చేయాలంటే సితారలో వస్తాయి. ముఖ్యంగా ఈ తరయం హీరోలు, దర్శకులతో ఎక్కువ సినిమాలు చేస్తూ ఎక్కువ విజయాలు అందుకుంటోందీ బ్యానర్.


బాబు బంగారం, ప్రేమమ్, జెర్సీ, భీష్మ, రంగ్ దే, డిజే టిల్లు వంటి ప్రామిసింగ్ హిట్స్ ఈ బ్యానర్ ఖాతాలో ఉన్నాయి. ఈ విజయాలే కాదు.. కొన్ని ఫ్లాపులూ ఉన్నా.. ఆ కథలు మాత్రం డిజప్పాయింట్ చేయవు. కొన్నిసార్లు ఎగ్జిక్యూషన్ లోపం వల్ల ఆ సినిమాలు పోయాయి తప్ప.. నాగవంశీ స్టోరీ జడ్జ్ మెంట్ మాత్రం ఎప్పుడూ తప్పు కాలేదు.

అది తక్కువ వయసులోనే సాధించడం అంటే చిన్న విషయం కాదు. అఫ్ కోర్స్ ఈ విషయంలో ఆయనకి చినబాబు, త్రివిక్రమ్ వంటి వారి అండ ఉంటుంది. అయినా తనదైన శైలిలో దూసుకుపోతున్నారు. ప్రస్తుతం సితార బ్యానర్ నుంచి మూడు సినిమాలు రాబోతున్నాయి. ఉప్పెన ఫేమ్ వైష్ణవ్ తేజ్, శ్రీలీల జంటగా ఆదికేశవ, డిజే టిల్లుకు కొనసాగింపుగా వస్తోన్న డిజే టిల్లు స్క్వేర్ తో పాటు లేటెస్ట్ జాతిరత్నం నవీన్ పోలిశెట్టితో అనగనగా ఒక రాజు చిత్రాలు లైన్ లో ఉన్నాయి.

ఆదికేశవ ఆగస్ట్ 25న విడుదల కాబోతోంది. డిజే టిల్లు సెప్టెంబర్ 15న అన్నారు. బట్ డేట్ లో మార్పులు ఉండొచ్చు. ఇక ఈ మూడూ చాలా ప్రామిసింగ్ గా కనిపిస్తున్నాయి.


తెలుగు సినిమా పరిశ్రమలో కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్స్ బ్యానర్ అన్న పేరును అతి తక్కువ టైమ్ లోనే తెచ్చుకున్న నాగవంశీ జర్నీ ఇలాగే ఇంకా బ్లాక్ బస్టర్స్ తో సాగాలని కోరుకుంటూ హిట్ మెషీన్ లా దూసుకుపోతోన్న ప్రొడ్యూసర్ కు తెలుగు 70ఎమ్ఎమ్ తరఫు నుంచి హృదయ పూర్వక పుట్టిన రోజు శుభాకాంక్షలు చెబుతోంది.

Related Posts