హాస్పిటల్ నుంచి గద్దర్ రాసిన చివరి లేఖ

గుమ్మడి విఠల్ నా పేరు. గద్దర్ నా పాట పేరు. నా బతుకు సుదీర్ఘ పోరాటం. నా వయసు 76 సంవత్సరాలు. నా వెన్నుపూసలో ఇరుక్కున్న తూటా వయస్సు 25 సంవత్సరాలు. నా పేరు జనం గుండె చప్పుడు. నా గుండె చప్పుడు ఆగిపోలేదు. కానీ ఎందుకో గుండెకు గాయం అయ్యింది.

ఈ గాయానికి చికిత్స కోసం బేగంపేటలోని శ్యామకరణ్‌ రోడ్డులో అపోలో స్పెక్ట్రా హాస్పిటల్‌లో చేరాను. జూలై 20 నుంచి అన్ని రకాల పరీక్షలు, చికిత్సలు తీసుకుంటూ కుదుటపడుతున్నాను. డాక్టర్ల వైద్యం తర్వాత పూర్తి ఆరోగ్యంతో కోలుకుని తిరిగి మీ మధ్యకు వచ్చి సాంస్కృతిక ఉద్యమం ప్రారంభించి, ప్రజల రుణం తీర్చుకుంటానని ప్రజల సాక్షిగా మాట ఇస్తున్నాను.

హాస్పిటల్‌లో జూలై 31న మీడియాకు రాసిన లేఖ ఇది. తిరిగి వస్తాడన్న నమ్మకం నిజం కాలేదు.

Related Posts