శరవేగంగా పూర్తవుతోన్న ‘ఈగల్

సంక్రాంతి బరిలో విడుదల తేదీలు ఖరారు చేసుకున్న చిత్రాలు శరవేగంగా పూర్తవుతున్నాయి. వీటిలో రవితేజ ‘ఈగల్’ కూడా ఒకటి. ఏడాదికి ఈజీగా రెండు, మూడు సినిమాలను రిలీజ్ చేసే రవితేజ.. వచ్చే యేడాది సంక్రాంతి కానుకగా ‘ఈగల్’ సినిమాని తీసుకొస్తున్నాడు. ‘కార్తికేయ 2, ధమాకా’ సినిమాలకు సినిమాటోగ్రాఫర్ గా పనిచేసిన కార్తిక్ ఘట్టమనేని ఈ చిత్రానికి దర్శకుడు. ఈ సినిమాలో రవితేజాకి జోడీగా అనుపమ పరమేశ్వరన్ నటిస్తుంది. నవదీప్, శ్రీనివాస్ అవసరాల, మధుబాల, కావ్యథాపర్ ఇతర కీ రోల్స్ లో కనిపించబోతున్నారు.

రవితేజ కెరీర్ లో 73వ సినిమా అయిన ‘ఈగల్’ స్పై యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కుతోంది. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన ప్రిన్సిపల్ ఫోటోగ్రఫీ పూర్తయ్యిందట. కేవలం చిన్న ప్యాచ్ వర్క్ మాత్రమే పెండింగ్ ఉందట. ఆ మిగిలిన ప్యాచ్ వర్క్ ను నవంబర్ మొదటి వారంలో పూర్తిచేయడానికి ప్రణాళిక సిద్ధం చేసిందట టీమ్. ఇక నవంబర్ ఫస్ట్ వీక్ లోనే ఈ మూవీ టీజర్ వచ్చే అవకాశం ఉంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై ‘ఈగల్’ చిత్రం రూపొందుతోంది.

Related Posts