HomeMoviesటాలీవుడ్సీక్వెల్అన్నారు.. రీ రిలీజ్ చేస్తున్నారా

సీక్వెల్అన్నారు.. రీ రిలీజ్ చేస్తున్నారా

-

కొన్ని సినిమాలకు టైమ్ ఉండదు. అవి ఎవర్ గ్రీన్ క్లాసిక్స్ గా నిలిచిపోతాయి. అలాంటి లిస్ట్ లో ఖచ్చితంగా ఉండే సినిమా 7/జి బృందావన కాలనీ. సెల్వరాఘవన్ తెరకెక్కించిన ఈ చిత్రాన్ని ఏఎమ్ రత్నం నిర్మించాడు. ఆయన తనయుడే రవికృష్ణ హీరోగా పరిచయం అయిన సినిమా ఇది. సోనియా అగర్వాల్ హీరోయిన్. కల్ట్ క్లాసిక్ లవ్ స్టోరీ అన్న రివ్యూస్ తెచ్చుకుందీ సినిమా.

ఎందుకూ పనికి రాడు అని తండ్రి చేత నిత్యం తిట్లు తినే ఓ కుర్రాడు తమ కాలనీలోనే ఉండే ఓ అమ్మాయిని ప్రేమిస్తాడు.వీరివి వేర్వేరు కులాలు, మతాలు. మొదట ఒప్పుకోకున్న తర్వాత అతని ప్రేమను అంగీకరిస్తుంది. అంతకు ముందే అతన్ని ఓ ప్రయోజకుడుగా చేయాలని ప్రయత్నించి సక్సెస్ అవుతుంది. హీరో మెకానిక్ కంపెనీలో ఉద్యోగం తెచ్చుకుంటాడు.

తమ పెళ్లికి ఇంట్లో ఒప్పుకోరు అని తెలిసిన అనిత విడిపోయేందుకు అతన్ని ఒప్పిస్తుంది.ఈ క్రమంలో ఇద్దరూ శారీరకంగా కలుస్తారు.కానీ అతను మాట తప్పుతాడు. తను జీవితాంతం తనతో ఉండాలని అడుగుతాడు. దీనికి అనిత ఒప్పుకోదు. ఆ కోపంలో ఆమెపై చేయి చేసుకుంటాడు. అలా తను ఒంటరిగా వెళుతూ ఉంటుంది. తప్పు తెలుసుకున్న కుర్రాడు ఆమె వెనకే వెళుతుండగా అనితకు యాక్సిడెంట్ అవుతుంది. కళ్ల ముందే చనిపోతుంది. ఆ షాక్ లో అతను అలాగే ఉండిపోతాడు.ఆ తర్వాత జరిగే పరిణామాలు ప్రేక్షకుల హృదయాలను బరువెక్కిస్తాయి.


సింపుల్ స్టోరీ ఇది. కానీ బలమైన కథనం కనిపిస్తుంది. ప్రతి మిడిల్ క్లాస్ ఫ్యామిలీకీ టచ్ అవుతుంది. ప్రేమలో పడ్డ ప్రతి ఒక్కరి హృదయాలను కదిలిస్తుంది. ముఖ్యంగా రవికృష్ణ, చంద్ర మోహన్ మధ్య వచ్చే సీన్స్ మొదట నవ్వించినా అతనికి ఉద్యోగం వచ్చిన తర్వాత వచ్చే సీన్ కు కన్నీళ్లు పెట్టని వారు ఉండరు. ఇక సపోర్టింగ్ రోల్ లో కనిపించిన సుమన్ శెట్టి పాత్ర అద్భుతంగా ఉంటుంది. సోనియా, రవికృష్ణ ఈ పాత్రల కోసమే పుట్టారా అన్నట్టుగా నటించారు.

యువన్ శంకర్ రాజా సంగీతం అసలు హైలెట్ గా ఉంటుంది.
2004లో వచ్చిన ఈ సినిమాను రీ రిలీజ్ చేయడానికి ప్రయత్నాలు మొదలయ్యాయి. ఈ నాటి 4కే టెక్నాలజీకి అనుగుణంగా మార్చారు. అయితే ఈ చిత్రానికి సీక్వెల్ తీస్తా అని ప్రకటించాడు ఏఎమ్ రత్నం. ఆ పనులు ఎంత వరకు వచ్చాయో కానీ దానికంటే ముందు ఈ మూవీ రీ రిలీజ్ చేస్తున్నారు.త్వరలోనే రీ రిలీజ్ డేట్ అనౌన్స్ చేస్తారట.

ఇవీ చదవండి

English News