‘ఇళయరాజా‘ బయోపిక్ లో ధనుష్

ఈమధ్య కాలంలో టాలీవుడ్ టు బాలీవుడ్ బయోపిక్స్ ట్రెండ్ జోరుగా సాగుతోంది. ఈ లిస్టులో ఇప్పుడు మాస్ట్రో ఇళయరాజా బయోపిక్ కూడా చేరింది. ఐదు దశాబ్దాలకు పైగా సినీ సంగీత ప్రపంచంలో కొనసాగుతోన్న ఇళయరాజా వెయ్యికి పైగా సినిమాలకు సంగీత దర్శకత్వం వహించారు. ముఖ్యంగా తెలుగు, తమిళ సినిమాల్లో ఇళయరాజా ముద్ర ఎంతో ప్రత్యేకమైనది.

ఇళయరాజా బయోపిక్ తెరకెక్కించబోతున్నట్టు చాన్నాళ్లుగా ప్రచారం జరుగుతుంది. అయితే.. ఇప్పుడు అది సాకారమవుతోంది. విలక్షణ నటుడు ధనుష్ వెండితెరపై ఇళయరాజాగా కనిపించబోతున్నాడు. ఓ చిన్న పల్లెటూరు నుంచి మద్రాసు వచ్చి.. సంగీత ప్రపంచంలో రారాజుగా ఎదిగిన ఇళయారాజా జీవిత ప్రస్థానాన్ని ఈ చిత్రంలో ఆవిష్కరించనున్నారట. ‘ఇళయారాజ‘ టైటిల్ తోనే తెరకెక్కబోతున్న ఈ పాన్ ఇండియా మూవీ ఫస్ట్ లుక్ రిలీజయ్యింది. అరుణ్ మాథేశ్వరన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు.

Related Posts