కళ్యాణ్ రామ్ కోసం చరణ్ వదిలేసిన టైటిల్

ఒక సినిమాకి కంటెంట్ ఎంత ప్రధానమో.. టైటిల్ కూడా అంతే ముఖ్యం. సినిమాని జనాల్లోకి తీసుకెళ్లడంలో టైటిల్ కీలక పాత్ర పోషిస్తుంది. అందుకే.. తమ సినిమాల టైటిల్స్ విషయంలో ఎంతో కసరత్తులు చేస్తుంటారు మేకర్స్. అయినా.. తెలుగు చిత్ర పరిశ్రమలో టైటిల్స్ కొరత కొట్టొచ్చినట్టు కనిపిస్తూనే ఉంది. అందుకోసమే.. కొన్ని సందర్భాల్లో పాత టైటిల్స్ నే రిపీట్ చేస్తున్నారు.

లేటెస్ట్ గా నందమూరి కళ్యాణ్ రామ్ 21వ సినిమాకోసం ‘మెరుపు‘ అనే టైటిల్ ను అనుకుంటున్నారట. ఈ టైటిల్ తో గతంలో మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ సినిమా ఒకటి మొదలైంది. తమిళ దర్శకుడు ధరణి ఈ సినిమాని మొదలుపెట్టాడు. స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో సాగే ‘మెరుపు‘ చిత్రాన్ని కొంతభాగం షూట్ చేసి వర్కవుట్ అవ్వక ఆపేశారు. ఇప్పుడు ‘మెరుపు‘ టైటిల్ నే కళ్యాణ్ రామ్ 21 కోసం ఫిక్స్ చేసే ఆలోచనలో ఉన్నారట మేకర్స్.

కళ్యాణ్ రామ్ 21వ చిత్రాన్ని ప్రదీప్ చిలుకూరి దర్శకత్వం వహిస్తుండగా అశోక్ వర్ధన్ ముప్పా, సునీల్ బలుసు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో కళ్యాణ్ రామ్ కి జోడీగా సయీ మంజ్రేకర్ నటిస్తుండగా.. ఇతర కీలక పాత్రలో లేడీ సూపర్ స్టార్ విజయశాంతి కనిపించబోతుంది. అజనీష్ లోకనాథ్ ఈ సినిమాకి సంగీతాన్ని సమకూరుస్తున్నాడు. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ దశలో ఉంది.

Related Posts