‘బ్రో’కి ఎక్స్ ట్రాలేం లేవా..

పవన్ కళ్యాణ్‌, సాయితేజ్ కలిసి నటించిన సినిమా బ్రో. ఈ నెల 28న విడుదల కాబోతోన్న ఈ మూవీపై ఇప్పటి వరకైతే పెద్దగా అంచనాలు లేవు. తాజాగానే ప్రమోషన్స్ స్టార్ట్ చేశారు. తమన్ సారథ్యంలో వచ్చిన రెండు పాటలు పెద్దగా ఆకట్టుకోకపోవడం ఈ సినిమాకు పెద్ద మైనస్ గా మారిందనేది విశ్లేషకుల అంచనా.

అటు అభిమానుల్లో కూడా బ్రో పై మరీ హడావిడీ కనిపించడం లేదు అనే చెప్పాలి. ఈ మధ్య కాలంలో పవన్ కళ్యాణ్ లాంటి పెద్ద స్టార్ సినిమాకు ఇంత తక్కువ బజ్ ఉండటం ఆశ్చర్యమే. బట్ రిలీజ్ కు ఇంకా వారం రోజులకు పైనే టైమ్ ఉంది కాబట్టి.. ఈ లోగా ఆడియన్స్ నుంచి ఆ బజ్ తెచ్చుకుంటారేమో కానీ.. మొత్తంగా చూస్తే ఈ మూవీకి సంబంధించి ప్రొడ్యూసర్ టిజి విశ్వ ప్రసాద్ ఓ సర్ ప్రైజింగ్ న్యూస్ చెప్పాడు.


ఈ మధ్య పెద్ద హీరోల సినిమాలు అనగానే.. ఎక్ట్స్ ట్రా షోస్, ఎక్ట్స్ అమౌంట్ అంటూ ప్రభుత్వాల దగ్గర నుంచి పర్మిషన్స్ తెచ్చుకుంటున్నారు. అంటే వీకెండ్ వరకూ టికెట్ రేట్లు పెంచుకోవడం.. ఉదయం ఆట వంటి ఎక్స్ ట్రా వసూళ్లకు వీలుండే పర్మిషన్స్ అన్నమాట. బట్ బ్రో విషయంలో అవేం చేయడం లేదట. ఈ సినిమా ఇప్పటి వరకూ వస్తోన్న సినిమాల్లానే నార్మల్ గానే ఉంటుందని చెబుతున్నారు.

అంటే ఇప్పుడు రేట్లే.. అందులో మార్పు ఉండదు. ఇప్పుడున్న షోస్ కు మించి అదనపు ఆటలు ఉండవు. అందుకు కారణం కూడా చెప్పాడు విశ్వ ప్రసాద్. ఈ చిత్రాన్ని తాము అనుకున్న బడ్జెట్ లోనే పూర్తి కంట్రోల్ తో చేశారట. అందువల్ల అదనపు ఖర్చులేం లేవు కాబట్టి.. ఆడియన్స్ నుంచి అదనపు వసూళ్లు కూడా చేయొద్దని నిర్ణయించుకున్నారట.

నిజంగా ఈ మధ్య ఇలాంటి అవకాశాలను విపరీతంగా వాడుకుంటూ ప్రేక్షకులను నుంచి భారీగా దండుకుంటున్న నిర్మాతల మధ్య టిజి విశ్వ ప్రసాద్ లాంటి నిర్మాతలు ఉండటం కొంత ఆశ్చర్యమే. సో ఫ్యాన్స్ కు తెల్లవారు ఝామునే లేచి హడావిడీ చేయాల్సిన అవసరం లేదన్నమాట.

Related Posts