బాలకృష్ణతో యాక్షన్ కి రెడీ అయిన బాబీ డియోల్

ఒకప్పుడు బాలీవుడ్ లో ‘గుప్త్, సోల్జర్’ వంటి బడా హిట్స్ అందుకున్న బాబీ డియోల్ ఆ తర్వాత విజయాలకు దూరమయ్యాడు. ‘హౌస్ ఫుల్ 4’తో మళ్లీ బీటౌన్ లో సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టాడు. అయినా.. హీరోగా కంటే ‘యామినల్’ మూవీతో విలన్ గా టర్న్ అవ్వడం బాబీకి బాగా కలిసొచ్చింది. ‘యానిమల్’ తర్వాత ఇప్పుడు వరుసగా దక్షిణాదిన బడా మూవీస్ తో బిజీ అవుతున్నాడు బాబీ డియోల్.

ఈ లిస్టులో ఇప్పటికే పవన్ కళ్యాణ్ ‘హరిహర వీరమల్లు’, సూర్య ‘కంగువ’ వంటి సినిమాలున్నాయి. వీటితో పాటు నటసింహం బాలకృష్ణ 109 కూడా బాబీ డియోల్ కిట్టీలో ఉంది. ‘వాల్తేరు వీరయ్య’ హిట్ తో సూపర్ ఫామ్ లో ఉన్న బాబీ కొల్లి దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందుతోంది. ఇప్పటికే మేజర్ పార్ట్ షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ‘ఎన్.బి.కె. 109’ సెట్స్ లోకి లేటెస్ట్ గా అడుగుపెట్టాడు బాబీ డియోల్. ప్రస్తుతం బాలయ్య.. ఎన్నికల ప్రచారంతో బిజీగా ఉండడంతో సినిమాలో బాబీ డియోల్ కి సంబంధించి కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరించనున్నాడట డైరెక్టర్ బాబీ. సితార ఎంటర్ టైన్ మెంట్స్ అత్యంత భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది.

Related Posts