ఎన్టీఆర్ స్పీచ్ కు ఫిదా అయిన బెంగళూరు

చనిపోయేంత వరకూ భూమిపై ఎంతోమంది బ్రతుకుతారు. మరణించిన తర్వాత కోట్లమంది హృదయాల్లో బ్రతికే ఉంటారు కొందరు. ఆ కొందరిలో కన్నడ స్టార్ హీరో పునీత్ రాజ్ కుమార్ ఉంటారు అంటూ.. ఇంచు మించు ఇదే అర్థం వచ్చేలా యంగ్ టైగర్ ఎన్టీఆర్ కన్నడలో ఇచ్చిన స్పీచ్ కు ఎంటైర్ కన్నడిగులు ఫిదా అయిపోయారు. కొన్నాళ్ల క్రితం హార్ట్ ఎటాక్ తో మరణించిన పునీత్ గౌరవార్థం కర్ణాటక రాష్ట్ర అత్యున్నత అవార్డ్ అయిన కర్ణాటకరత్నను పునీత్ కు అందించింది అక్కడి ప్రభుత్వం. ఈ కార్యక్రమానికి తెలుగు నుంచి ఎన్టీఆర్ కు మాత్రమే ఆహ్వానం అందింది. తమిళ్ నుంచి సూపర్ స్టార్ రజినీకాంత్ కు ఆహ్వానం అందింది. ఇక వేదికపైకి ఇన్ఫోసిస్ నారాయణమూర్తి భార్య సుధామూర్తి వచ్చారు.

ఆ టైమ్ లో ఆమెకు సీట్ రెడీగా లేదు. వెంటనే ఎన్టీఆర్ లేచి సుధామూర్తిని స్వయంగా తీసుకునివెళ్లి తన సీట్ లో కూర్చోబెట్టిన సీన్ చూసి చాలామంది అతని సంస్కారాన్ని అభినందిస్తున్నారు. ఎందుకంటే ఎన్టీఆర్ తో పాటు ఇంకా కొందరు ఉన్నారు. కానీ ఎవరూ అలా చేయలేదు.పునీత్ కు అవార్డ్ ను అందించడానికి ముందే కర్ణాటక ముఖ్యమంత్రి ఎన్టీఆర్ ను పిలిపించి సత్కరించడం విశేషం. ఇక వేదికపై ఎన్టీఆర్ మాటలకు కర్ణాటక ప్రజలు అద్భుతంగా హర్షం వ్యక్తం చేశారు. తన స్పీచ్ మొత్తం కన్నడలోనే మాట్లాడాడు ఎన్టీఆర్. అతని తల్లి కన్నడిగురాలు కావడంతో పాటు రీసెంట్ గా తన ఆర్ఆర్ఆర్ మూవీ డబ్బింగ్ కోసం కూడా కన్నడ స్పష్టంగా నేర్చుకున్నాడు ఎన్టీఆర్. ఏదేమైనా ఎన్టీఆర్ సంస్కారానికి, స్పీచ్ కి చాలామంది ప్రశంసలు కురిపిస్తున్నారు.

Related Posts