హిందీలో డబ్బింగ్ చెప్పిన బాలయ్య

బాలకృష్ణ బ్లాక్ బస్టర్ మూవీ ‘భగవంత్ కేసరి’ బాలీవుడ్ ఆడియన్స్ ను సైతం అలరించడానికి సిద్ధమవుతోంది. ప్రస్తుతం ఈ సినిమా హిందీ వెర్షన్ కి సంబంధించిన డబ్బింగ్ కార్యక్రమాలు జరుగుతున్నాయట. ముఖ్యంగా హిందీలో తన పాత్రకు తానే డబ్బింగ్ చెప్పాడట నటసింహం. ఇదే విషయాన్ని లేటెస్ట్ గా జరిగిన భగవంత్ కేసరి బాక్సాఫీస్ కా షేర్ సెలబ్రేషన్స్ లో వెల్లడించాడు బాలయ్య.

గతంలో బాలకృష్ణ నటించిన పలు సినిమాలు అనువాద రూపంలో హిందీ ఆడియన్స్ ను పలకరించాయి. ముఖ్యంగా యూట్యూబ్, హిందీ టి.వి. ఛానెల్స్ లో బాలయ్య యాక్షన్ మూవీస్ కి మంచి క్రేజుంది. ఇప్పుడు టాలీవుడ్ లో సూపర్ హిట్టైన ‘భగవంత్ కేసరి’ బాలీవుడ్ కి వెళ్లబోతుంది. ఈ సినిమాలో విలన్ గా నటించిన అర్జున్ రాంపాల్ హిందీ హీరోనే కాబట్టి.. అది కూడా ఈ సినిమాకి కలిసొచ్చే అంశమే. త్వరలోనే ఈ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ ను కూడా అనౌన్స్ చేయనున్నారు.

Related Posts