మే 17న రీ రిలీజ్ అవుతోన్న ‘అపరిచితుడు’

ప్రస్తుతం జోరుగా సాగుతోన్న రీ రిలీజుల ట్రెండ్ లో విక్రమ్ ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్ ‘అపరిచితుడు’ కూడా చేరింది. 2005లో విడుదలైన ‘అపరిచితుడు’ చిత్రం అటు తమిళం, ఇటు తెలుగు భాషల్లో అఖండ విజయాన్ని సాధించింది. విక్రమ్ కెరీర్ ను మలుపు తిప్పిన చిత్రంగా ‘అపరిచితుడు’ని చూడొచ్చు. ఇక.. ‘బాయ్స్’ ఫ్లాప్ తో సతమతమైన శంకర్ ని మళ్లీ ఫామ్ లో నిలిపిన సినిమా ‘అపరిచితుడు’.

ఈ సినిమాలో మల్టీ పర్సనాలిటీ డిజార్డర్ తో బాధపడే వ్యక్తిగా విక్రమ్ నటించాడు. ఈ మూవీలో రామానుజం, అపరిచితుడు, రెమో గా మూడు పాత్రల్లో అలరించాడు విక్రమ్. సమాజంలో తప్పులు చేసే వారికి.. గరుడ పురాణంలో పేర్కొన్న విధంగా శిక్షలు విధించే అపరిచితుడు రోల్ లో అయితే అదరగొట్టాడు. విక్రమ్ కి జోడీగా సదా నటించగా.. ఇతర కీలక పాత్రల్లో ప్రకాష్ రాజ్, వివేక్, నాజర్ కనిపించారు. హారిస్ జయరాజ్ సంగీతం ‘అపరిచితుడు’కి మరో హైలైట్. ఆస్కార్ ఫిల్మ్స్ బ్యానర్ పై వి.రవిచంద్రన్ నిర్మించిన ‘అపరిచితుడు’ మే 17న మళ్లీ థియేటర్లలోకి రాబోతుంది.

Related Posts