త్రిషను వెంటాడుతోన్న మరో వివాదం

సీనియర్ హీరోయిన్ త్రిషను ఏదో వివాదం వెంటాడుతూనే ఉంది. ఆమధ్య నటుడు మన్సూర్ అలీఖాన్, త్రిష మధ్య జరిగిన వివాదం గురించి తెలిసిందే. ‘లియో’ సినిమాలో త్రిషతో తనకు
రేప్ సీన్ చేసే అవకాశం రాలేదంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు మన్సూర్. ఆ తర్వాత దీనిపై చిరంజీవి మొదలుకొని చాలామంది స్పందించడం.. మన్సూర్ ఆలీ ఖాన్ పరువు నష్టం పేరుతో కోర్టుకెక్కడం.. ఆనక కోర్టు అతనికి మొట్టికాయలు వేయడం జరిగింది.

తాజాగా.. అన్నాడీఎంకే బహిష్కృత నేత ఏవీ రాజు, త్రిషపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ‘గతంలో గౌవత్తూరులో త్రిష ఓ ఫంక్షన్ కు హాజరైంది. స్థానిక ఎమ్మెల్యే త్రిషపై మనసుపడ్డాడు. ఒక రోజుకు 25 లక్షలు చెల్లించి త్రిషతో గడిపాడు. దానికి నేనే సాక్ష్యం’ అంటూ ప్రకటించాడు. సదరు వీడియో నెట్టింట వైరల్ గా మారింది.

అటెన్షన్‌ కోసం ఏ స్థాయికైనా దిగజారిపోయే వారిని పదే పదే చూస్తుండడం అసహ్యంగా ఉందంటూ త్రిష సోషల్ మీడియా వేదికగా స్పందించింది. సదరు వ్యక్తులపై కఠినమైన చర్యలు తీసుకుంటామని, ఇకపై తాను ఇచ్చే సమాధానం లీగల్‌ డిపార్ట్‌మెంట్‌ నుంచే వస్తుందని హెచ్చరించింది. ప్రస్తుతం త్రిష తెలుగులో చిరంజీవితో ‘విశ్వంభర’లో నటిస్తుంది. మరోవైపు.. తమిళంలో కమల్ హాసన్-మణిరత్నం ‘థగ్ లైఫ్’, అజిత్ సినిమాలలోనూ నాయికగా నటిస్తోంది

Related Posts