‘భారతీయుడు 2’ ప్రచారానికి సర్వం సిద్ధం

జూలై లో సందడి చేయబోతున్న ‘భారతీయుడు 2’ ప్రచార పర్వం మొదలుపెట్టబోతుంది టీమ్. విశ్వనటుడు కమల్ హాసన్, భారీ చిత్రాల దర్శకుడు శంకర్ కలయికలో రూపొందుతోన్న ఈ సినిమా నుంచి ఇప్పటికే టీజర్, సాంగ్స్ బయటకు వచ్చాయి. ఇప్పుడు ట్రైలర్ ను గ్రాండ్ లెవెల్ లో రిలీజ్ చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి.

ముంబై వేదికగా జూన్ 25న ‘భారతీయుడు 2’ ట్రైలర్ ను విడుదల చేయబోతున్నారట. 2 నిమిషాల 36 సెకండ్ల నిడివితో ఈ ట్రైలర్ ఉంటుందని తెలుస్తోంది. మరోవైపు.. జూన్ 30న హైదరాబాద్ లో ‘భారతీయుడు 2’ ప్రి-రిలీజ్ ఈవెంట్ జరగబోతున్నట్టు తెలుస్తోంది. ఈ ఈవెంట్ కి మెగాస్టార్ చిరంజీవితో పాటు.. మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ కూడా ముఖ్య అతిథులుగా హాజరుకానున్నారట.

Related Posts