తమిళంలో మరో ఆఫర్ అందుకున్న మీనాక్షి

హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన తక్కువ సమయంలోనే ఇటు తెలుగు, అటు తమిళం భాషల్లో మంచి అవకాశాలతో దూసుకెళుతోంది మీనాక్షి చౌదరి. ‘ఇచట వాహనములు నిలుపరాదు’ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన మీనాక్షి.. ఆ తర్వాత ‘ఖిలాడి, హిట్, గుంటూరు కారం’ సినిమాలతో మురిపించింది. ప్రస్తుతం సితార సంస్థలో ‘లక్కీ భాస్కర్’ చేస్తుంది. దుల్కర్ సల్మాన్, మీనాక్షి జంటగా వెంకీ అట్లూరి డైరెక్షన్ లో ఈ సినిమా రూపొందుతోంది.

మరోవైపు.. తమిళంలో ఇలయదళపతి విజయ్ తో ‘ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్’లో నటిస్తుంది. ఈ సినిమాలో విజయ్ కి జోడీగా చేస్తుంది మీనాక్షి. ఇక.. కోలీవుడ్ లో లేటెస్ట్ గా మరో ఆఫర్ అందుకుందట. పాపులర్ కమెడియన్ కమ్ హీరో సంతానం నటించే ‘దిల్లుకు దుడ్డు-4’లో మీనాక్షి హీరోయిన్ గా నటిస్తుందట.

సంతానం నటించే హారర్ కామెడీ సిరీస్ ‘దిల్లుకు దుడ్డు’కి మంచి పాపులారిటీ ఉంది. ఇప్పటికే ఈ సిరీస్ లో మూడు సినిమాలొచ్చాయి. త్వరలోనే.. నాల్గవ చిత్రం పట్టాలెక్కబోతుంది. ప్రేమానంద్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని హీరో ఆర్య నిర్మిస్తున్నాడు.

Related Posts