‘నా సామిరంగ‘ నుంచి ఆషిక రంగనాథ్ ఫస్ట్ లుక్

కింగ్ నాగార్జున కొత్త సినిమా ‘నా సామిరంగ‘. సంక్రాంతి బరిలో విడుదలకు ముస్తాబవుతోన్న ఈ మూవీలో ఆషిక రంగనాథ్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ చిత్రంలో వరలక్ష్మి అనే పాత్రలో కనిపించబోతుంది ఆషిక. మా వరలక్ష్మిని మీకు పరిచయం చేస్తున్నాం అంటూ.. సినిమా నుంచి ఆషిక ఇంట్రో గ్లింప్స్ రిలీజ్ చేశారు మేకర్స్. ఈ గ్లింప్స్ లో పదహారణాల తెలుగమ్మాయిగా చీరలో ఎంతో అందంగా ఆకట్టుకుంటుంది ఆషిక. ఈ గ్లింప్స్ లో కింగ్ నాగార్జున కూడా స్టైలిష్ గా స్మోకింగ్ చేస్తూ కనువిందు చేస్తున్నాడు.

శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ బ్యానర్ పై శ్రీనివాసా చిట్టూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కొరియోగ్రాఫర్ విజయ్ బిన్నీ డైరెక్ట్ చేస్తున్నాడు. గతంలో నాగార్జునకు పలు మ్యూజికల్ హిట్స్ అందించిన కీరవాణి ఈ మూవీకి మ్యూజిక్ డైరెక్టర్. త్వరలోనే ‘నా సామిరంగ‘ ఫస్ట్ సింగిల్ రాబోతున్నట్టు అనౌన్స్ చేసింది టీమ్.

Related Posts