రాజ్ తరుణ్ యాక్షన్ అవతార్ లో ‘తిరగబడరసామీ..‘

యంగ్ హీరో రాజ్ తరుణ్ యాక్షన్ అవతారమెత్తాడు. సీనియర్ డైరెక్టర్ ఎ.ఎస్.రవికుమార్ చౌదరి దర్శకత్వంలో ‘తిరగబడరసామీ..‘ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ సినిమాలో రాజ్ తరుణ్ కి జోడీగా మాల్వీ మల్హోత్రా, మన్నారా చోప్రా నటించారు. సురక్ష్ ఎంటర్ టైన్ మెంట్స్ మీడియా బ్యానర్ పై మాల్కాపురం శివకుమార్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

జె.బి, భోలే శావలి సంగీతాన్ని సమకూరుస్తున్నారు. త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ‘తిరగబడరసామీ..‘ మూవీ ట్రైలర్ రిలీజయ్యింది. ఇప్పటివరకూ ఎక్కువగా రొమాంటిక్ రోల్స్ లో మురిపించిన రాజ్ తరుణ్.. ఈ సినిమాకోసం యాక్షన్ అవతార్ లో రెచ్చిపోయినట్టు ట్రైలర్ ను బట్టి తెలుస్తోంది.

Related Posts