వెంకటేష్ సరసన కథానాయికలు ఖరారు..!

విక్టరీ వెంకటేష్-అనిల్ రావిపూడి కాంబోలో రూపొందే హ్యాట్రిక్ మూవీ రేపు ముహూర్తాన్ని జరుపుకోనుంది. స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు తన శ్రీవెంకటేశ్వర సినీ క్రియేషన్స్ పై 58వ చిత్రంగా ఈ మూవీని ప్రొడ్యూస్ చేస్తున్నాడు. ఈ సినిమా కోసం సంగీత దర్శకుడిగా భీమ్స్ ను ఎంపిక చేసుకున్న సంగతి తెలిసిందే.

ఓ ఎక్స్ కాప్.. అతని ఎక్స్ గర్ల్ ఫ్రెండ్.. అలాగే.. అతని ఎక్స్ లెంట్ వైఫ్ అంటూ ఈ మూవీ ఒక ట్రయాంగులర్ లవ్ స్టోరీగా తెరకెక్కనుందనే హింట్ ఇచ్చాడు డైరెక్టర్ అనిల్ రావిపూడి. లేటెస్ట్ గా ఈ మూవీలో వెంకటేష్ సరసన నటించే వైఫ్, గర్ల్ ఫ్రెండ్ క్యారెక్టర్స్ కి సంబంధించి నటీమణుల వివరాలు బయటకు వచ్చేశాయి.

వెంకటేష్ భార్య పాత్రలో ఐశ్వర్య రాజేష్ నటించబోతుందని అధికారికంగా ప్రకటించారు. ఇక.. వెంకీ గర్ల్ ఫ్రెండ్ గా మీనాక్షి చౌదరి కనిపించనుందట.

Related Posts