‘ఈగల్‘ నుంచి ఫస్ట్ సింగిల్ ప్రోమో

సంక్రాంతి సినిమాల పాటల హంగామా మొదలయ్యింది. సంక్రాంతి బరిలో రాబోతున్న ‘గుంటూరు కారం, సైంధవ్, హనుమాన్‘ సినిమాల నుంచి ఫస్ట్ సింగిల్స్ వచ్చేశాయి. ఇప్పుడు మరో సంక్రాంతి మూవీ ‘ఈగల్‘ నుంచి ఫస్ట్ సింగిల్ వస్తోంది. ‘ఆడు మచ్చా ఆడు మచ్చా.. అగడి బగడి ఆడు‘ అంటూ సాగే ఈ మాస్ సాంగ్ ప్రోమో రిలీజైంది. ఓ జాతర సీక్వెన్స్ లో వచ్చే పాటలా అనిపిస్తుంది.
పూనకంతో ఊగిపోయే ఆడవాళ్ల మధ్యలో లాల్చీ, లుంగీలో రవితేజా వేసిన స్టెప్స్ ఈ పాటలో స్పెషల్ అట్రాక్షన్ గా ఉండబోతున్నట్టు తెలుస్తోంది. ఫుల్ సాంగ్ రేపు (డిసెంబర్ 5) రానుంది.

పొడవాటి జుట్టు, గడ్డంతో మాస్ మహారాజ సరికొత్త మేకోవర్ తో సందడి చేయబోతున్న ఈ సినిమాకి సినిమాటోగ్రాఫర్ కార్తీక్ ఘట్టమనేని దర్శకుడు. ఈ మూవీలో అనుపమ పరమేశ్వరన్ కథానాయికగా నటిస్తుంది. నవదీప్, శ్రీనివాస్ అవసరాల, మధుబాల, కావ్యథాపర్ ఇతర కీ రోల్స్ పోషిస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ నుంచి వస్తోన్న ‘ఈగల్‘ సంక్రాంతి కానుకగా జనవరి 13న విడుదలవుతోంది.

Related Posts