ఒక్క పాట కోసం 16 కోట్లా?

ఇండియన్ సినీ ఇండస్ట్రీలో భారీ చిత్రాల దర్శకుడిగా పేరు సంపాదించుకున్నాడు శంకర్. ఈ లెజెండరీ డైరెక్టర్ తొలి సినిమా నుంచి ఇదే పద్ధతిని అనుసరిస్తున్నాడు. సామాజిక సందేశాత్మక కథాంశాలను వెండితెరపై అద్భుతంగా ఆవిష్కరిస్తాడన్న పేరున్న శంకర్.. తన సినిమాల్లోని పాటలను ఎంతో ప్రత్యేకంగా తీర్చిదిద్దుతుంటాడు. శంకర్ తీసే ఒక్కో పాటతో.. ఓ చిన్న సైజ్ సినిమాని పూర్తిచేయొచ్చనే కామెంట్స్ వినిపిస్తూ ఉంటాయి.

లేటెస్ట్ గా మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ ‘గేమ్ ఛేంజర్’ విషయంలోనూ తన పాత స్ట్రాటజీనే అవలంబించాడట శంకర్. ఈ సినిమాలోని పాటల కోసమే ఏకంగా రూ.90 కోట్ల బడ్జెట్ ను కేటాయించాడట. ఇక.. దివాళి కానుకగా రాబోతున్న ‘జరగండి’ పాటకు అయితే రూ.16 కోట్లు ఖర్చయ్యిందట. ఇప్పటికే దసరా కానుకగా విడుదలైన ఈ సాంగ్ కి సంబంధించి ఓ స్టిల్ ను రిలీజ్ చేశారు.

భారీ ఎత్తున ఉన్న రంగు రంగుల బిల్డింగ్స్ మధ్య చరణ్ కనిపిస్తున్న ఈ స్టిల్ అయితే సూపర్బ్ గా ఉంది. ఇక.. ఈ లొకేషన్ మొత్తాన్ని సెట్ గా నిర్మించారని.. అందుకే ఈ పాటకు అంత ఖర్చయ్యిందనే ప్రచారం జరుగుతోంది. ఏదేమైనా దివాళి కానుకగా రాబోతున్న ‘జరగండి’ పాట ఏ రీతిన ఆకట్టుకుంటుందో చూడాలి.

Related Posts