‘RC16’.. మార్చి లో పూజ.. మే నుంచి సెట్స్ పైకి

రామ్ చరణ్ – బుచ్చిబాబు కాంబినేషన్ లో రూపొందుతోన్న చిత్రం శరవేంగా ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తిచేసుకుంటోంది. ‘RC16’ వర్కింగ్ టైటిల్ తో రూపొందుతోన్న ఈ సినిమా ఎప్పుడు పట్టాలెక్కుతోంది? అనేది అందరిలోనూ ఆసక్తికరంగా మారింది.
నిన్న (ఫిబ్రవరి 15) డైరెక్టర్ బుచ్చిబాబు బర్త్ డే స్పెషల్ గా మరోసారి ట్రెండింగ్ లోకి వచ్చింది ‘RC16’. ఇక.. లేటెస్ట్ గా ఫిల్మ్ సర్కిల్స్ లో వినిపిస్తున్న కథనం ప్రకారం ఈ క్రేజీ మూవీ మార్చి లో పూజా కార్యక్రమాలతో ప్రారంభం కానుందట. మార్చి నెలలోనే రామ్ చరణ్ బర్త్ డే స్పెషల్ గా ఈ సినిమా నుంచి స్పెషల్ గ్లింప్స్ కూడా రిలీజ్ చేసే సన్నాహాల్లో ఉందట టీమ్.

మే నుంచి పట్టాలెక్కనున్న ‘RC16’ మూవీని వరుస షెడ్యూల్స్ లో వీలైనంత తొందరగా షూటింగ్ కంప్లీట్ చేయడానికి ప్రణాళికను సిద్ధం చేస్తున్నారట. ఈ సినిమా కథ విషయానికొస్తే ఉత్తరాంధ్ర నేపథ్యంలో సాగే స్పోర్ట్స్ మూవీ ఇది. ఈ చిత్రంలో రామ్ చరణ్ పాత్ర ఎంతో విలక్షణంగా ఉంటుందట. ‘రంగస్థలం’ చిత్రంలో చెవిటి పాత్రలో అదరగొట్టాడు చెర్రీ. ఈ సినిమాలోనూ రామ్ చరణ్ కి ఫిజికల్ గా కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయట. అయినా.. అవన్నీ అధిగమించి స్పోర్ట్స్ లో ఎలాంటి విజయాలు సాధించాడు అనే నేపథ్యంతో ఈ సినిమాని ఎమోషనల్ గా తీర్చిదిద్దుతున్నాడట బుచ్చిబాబు.

Related Posts