అక్కినేని నాగ చైతన్య కొత్త సినిమా టైటిల్ ను అనౌన్స్ చేశారు. ఈ చిత్రానికి కస్టడీ అనే టైటిల్ పెట్టారు. ఆల్రెడీ ఒక లుక్ రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్ తోనే ఈ టైటిల్ చెప్పారు. తమిళ్ డైరెక్టర్ వెంకట్ ప్రభు రూపొందిస్తోన్న ఈ మూవీ లోలో కృతి శెట్టి హీరోయిన్.

ఈ లుక్ లో చే ఇంటెన్స్ గా కనిపిస్తున్నాడు. అతను శివ అనే హానెస్ట్ ఆండ్ పవర్ఫుల్ పోలీస్ గా నటిస్తున్నాడు. ఐతే ఈ లుక్ లో అతన్ని పోలీస్ లే కస్టడీ లోకి తీసుకుంటున్నట్టుగా కనిపించడం ఆసక్తిని పెంచుతోంది. చైతన్య లుక్ కూడా అదిరిపోయింది. పోలీస్ గా బావున్నాడు కూడా. ఇక నాగార్జున సూపర్ హిట్ మూవీ శివ ను అతని పేరుగా పెట్టడమూ ఆకట్టుకుంటోంది.


తెలుగుతో పాటు తమిళ్ లోను ఒకేసారి విడుదల కాబోతోన్న ఈ మూవీ తో చే ఖచ్చితంగా బ్లాక్బూస్టర్ కొడతాడు అనిపిస్తోంది. ఇక చాల వేగంగా షూటింగ్ జరుపుకుంటోన్న కస్టడీ మూవీ ని వచ్చే మార్చ్ లో రిలీజ్ చేసే అవకాశాలు ఉన్నాయి.