“బంగార్రాజు” నిజంగా బంగార‌మే

టాలీవుడ్ కింగ్ నాగార్జున‌, యువ స‌మ్రాట్ నాగ‌చైత‌న్య‌ల క్రేజీ కాంబినేష‌న్లో రూపొందుతోన్న క్రేజీ మూవీ బంగార్రాజు. సోగ్గాడే చిన్ని నాయ‌నా చిత్రానికి ప్రీక్వెల్ గా బంగార్రాజు చిత్రం రూపొందుతోంది. ఈ చిత్రానికి టాలెంటెడ్ డైరెక్ట‌ర్ క‌ళ్యాణ్ కృష్ణ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. అయితే.. ఈ సినిమాను ఫ‌స్ట్ నుంచి నాగార్జున సంక్రాంతికి రిలీజ్ చేయాలి అని ఫిక్స్ అయ్యారు. ఇంకా చెప్పాలంటే.. సంక్రాంతికి రిలీజ్ చేయ‌డం కుదురుతుంది అనుకుంటేనే ఈ సినిమా స్టార్ట్ చేస్తాన‌న్నారు. దీనిని బ‌ట్టి అర్ధం చేసుకోవ‌చ్చు బంగార్రాజు చిత్రాన్ని సంక్రాంతికి విడుద‌ల చేయాల‌ని ఎంత ప‌ట్టుద‌ల‌గా ఉన్నారో.

అయితే.. ఆర్ఆర్ఆర్, రాధేశ్యామ్ సినిమాలు ఉండ‌డంతో ఈ సంక్రాంతికి బంగార్రాజు రిలీజ్ అవుతుందా..? వాయిదా ప‌డుతుంది..? అనేది ఆస‌క్తిగా మారింది. రిలీజ్ డేట్ అనౌన్స్ చేయ‌క‌పోవ‌డంతో బంగార్రాజు రావ‌డం క‌ష్ట‌మే అనుకున్నారు. అయితే.. ఆర్ఆర్ఆర్ వాయిదా ప‌డింది. అంతే… ఒక్క‌సారిగా అంతా మారిపోయింది. బంగార్రాజు టైమ్ స్టార్ట్ అయ్యింది.
బిజినెస్ ప‌రంగా చూస్తే.. ఆంధ్ర మహా అయితే 12 కోట్ల రేషియో లో రేటు వుండొచ్చు అనుకున్నారు.

ఇప్పుడు పరిస్థితి మారిపోవ‌డంతో…ఇక సంక్రాంతికి ఎన్ని సినిమాలు వున్నా బంగార్రాజే కింగ్. అందుకే రేటు కూడా మారిపోయినట్లు తెలుస్తోంది. ఆంధ్ర ఒక్కటే 18 కోట్ల రేషియో చెబుతున్నట్లు ఇండస్ట్రీ వర్గాల టాక్. 45 కోట్లకు జీ టీవీకి అన్ని హక్కులతో వచ్చిన సినిమా ఇది. ఆంధ్ర 18 కోట్లు చెబుతున్నారు అంటే.. టోటల్ థియేటర్ రైట్స్ మీదే ఓ నలభై దాకా లాగేయాలని డిసైడ్ అయిపోయినట్లు కనిపిస్తోంది. మొత్తానికి టైటిల్ కి త‌గ్గ‌ట్టుగా బంగార్రాజు నిజంగా బంగార‌మే.

Related Posts