వంద కోట్ల క్లబ్ లో హృతిక్ అరుదైన రికార్డు

ఒక సినిమా యాభై రోజులు, వంద రోజులు ఆడే కాలం పోయి.. వంద కోట్లు, రెండు వందల కోట్లు క్లబ్ ల నుంచి ఇప్పుడు వెయ్యి కోట్లు క్లబ్ వరకూ చేరుకుంది. ఇక.. వంద కోట్లు క్లబ్ కి శ్రీకారం చుట్టిన బాలీవుడ్ లో స్టార్ హీరో హృతిక్ రోషన్ ఇప్పుడో అరుదైన ఘనత పొందాడు. ఇప్పటివరకూ తన సినిమాలతో 14 సార్లు బాక్సాఫీస్ వద్ద వంద కోట్లు మార్కును అందుకున్న హీరోగా నిలిచాడు హృతిక్ రోషన్.

రిపబ్లిక్ డే సందర్భంగా విడుదలైన హృతిక్ రోషన్ ‘ఫైటర్’ చిత్రం బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతోంది. హృతిక్ రోషన్ ఫైటర్ చిత్రంతో 14వ సారి వంద కోట్ల క్లబ్ లో చేరాడు. ఈ చిత్రం విడుదలై రెండు రోజులు కూడా గడవకముందే ఈ ఘనత సాధించింది. అలాగే.. హృతిక్ ‘అగ్నిపథ్, కాబిల్’ వంటి సినిమాల తర్వాత రిపబ్లిక్ డే కి విడుదలై వంద కోట్ల గ్రాస్ సాధించిన హ్యాట్రిక్ మూవీగా నిలిచింది. సిద్దార్థ్ ఆనంద్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం మంచి పాజిటివ్ టాక్ తో రోజురోజుకూ పికప్ అవుతోంది.

Related Posts