దుమ్మురేపుతోన్న కార్తికేయ2-100 కోట్లు సాధిస్తుందా

ఒక చిన్న సినిమా.. వారి భాషలో చెప్పాలంటే చాలామంది తొక్కేయాలని చూసిన సినిమా.. కానీ ఇప్పుడా మూవీ బాక్సాఫీస్ ను షేక్ చేస్తోంది. ఇది కంటెంట్ కు ఉన్న బలం అని మరోసారి ప్రూవ్ చేసిన ఆ మూవీ కార్తికేయ2. తమ సినిమాను అనుకున్న టైమ్ కు రిలీజ్ కాకుండా చాలామంది అడ్డుకున్నారని మొదటి నుంచీ ఆ టీమ్ తెగ ఫీలైంది. బట్ ఇప్పుడు నడుస్తోంది వాళ్ల టైమ్. అందుకే కార్తికేయ2 తెలుగులోనే కాదు బాలీవుడ్ లోనూ బాక్సాఫీస్ ను షేక్ చేస్తోంది.

నిఖిల్ కెరీర్ లోనే హయ్యొస్ట్ కలెక్షన్స్ సాధించి సత్తా చాటుతోంది. కార్తికేయ2 గత శనివారం విడుదలైన సినిమా. 2014లో వచ్చిన కార్తికేయకు సీక్వెల్ గా రావడంతో ఈ సినిమాపై ముందు నుంచీ అంచనాలున్నాయి. దర్శకుడు చందూ మొండేటి ప్రతిభావంతుడు. ఇటు నిఖిల్ తన సినిమాకు సంబంధించి అన్నీ తానై ముందుంటాడు. టీజర్, ట్రైలర్ కూడా ఇంప్రెసివ్ గా ఉండటంతో అందరూ ష్యూర్ షాట్ అనుకున్నారు.

అనుకున్నట్టుగానే మంచి ఓపెనింగ్స్ వచ్చాయి. సినిమా కూడా అంచనాలకు తగ్గట్టుగా ఉండటంతో హిట్ టాక్ వచ్చేసింది. ఇంకేం.. ఈ మూవీతో పాటు వచ్చిన సినిమాలు పోవడం.. కార్తికేయ2 కంటెంట్ యూనిక్ గా ఉండటంతో అటు బాలీవుడ్ లో కూడా క్రేజ్ మొదలైంది. మొదట పది, ఇరవై థియేటర్స్ లోనే విడుదలైనా.. ఇప్పుడు వెయ్యికి పైగా థియేటర్స్ పెరిగాయి బాలీవుడ్ లో. అనూహ్యమైన ఈ రెస్పాన్స్ తో కార్తికేయ2 టీమ్ ఫుల్ ఖుషీగా ఉంది. ఆగస్ట్ 13న విడుదలైన కార్తికేయ2కు సోమవారం పబ్లిక్ హాలిడే కలిసొచ్చింది. అలాగే ఈ కృష్ణాష్టమితో పాటు ఈ వీకెండ్ కూడా ప్లస్ అయింది.

అందుకే ఇప్పటికే సినిమా 60కోట్లకు పైగా కలెక్ట్ చేసి కంటెంట్ కు ఉండే కెపాసిటీని తెలియజేస్తోంది. అంతా ఊహించేది నిజమే అయితే ఈ మూవీ ఖచ్చితంగా వంద కోట్ల క్లబ్ లో చేరుతుంది అంటున్నారు. ఎందుకంటే తెలుగులో ఈ వారం విడుదలైన సినిమాల్లో ఒక్కటి కూడా ఆకట్టుకోలేదు. అటు బాలీవుడ్ లోనూ అదే పరిస్థితి. సో.. కార్తికేయ2కు కాలం కూడా కలిసొచ్చింది. ఆ కాలం కాసుల పంటనూ తెస్తుంది కదా.. సో.. ఇది ఎంటైర్ టీమ్ కు అనుకోకుండా కలిసొచ్చిన అదృష్టం అందామా.. లేక బలమైన కథ, కథనాలు ఉంటే ప్రేక్షకులు ఎవరికైనా బ్రహ్మరథం పడతారు అందామా..?

Related Posts