Advertisement
వాపును బలుపు అనుకుంటోన్న సుడిగాలి సుధీర్
Latest Movies Tollywood

వాపును బలుపు అనుకుంటోన్న సుడిగాలి సుధీర్

Advertisement

సుడిగాలి సుధీర్.. బుల్లితెరపై తిరుగులేని ఇమేజ్ ఉన్న నటుడు. జబర్దస్త్ షోతో గుర్తింపు తెచ్చుకుని.. రష్మి జోడీగా పాపులరై.. ఏకంగా విమనైజర్ అనే పేరును అదేదో గొప్పతనపు చిరునామాలా అనుభవిస్తోన్న నటుడు. బుల్లితెరపై అనేక షోస్ లో హోస్ట్ గా చేస్తూ చాలా ఇమేజ్ తెచ్చుకున్నాడు. కొందరైతే అతన్ని బుల్లితెర మెగాస్టార్ అని కూడా అంటారు. ఈ ఇమేజ్ తోనే గతంలో మూడు సినిమాల్లో హీరోగా చేశాడు. ఒక్కటంటే ఒక్కటి కూడా మినిమంగా కూడా మెప్పించలేకపోయాయా చిత్రాలు. అంటే మనోడి పెతాపం చిన్నతెరపైనే కానీ పెద్ద తెరపై కాదు అని తేలిపోయింది. పైగా టివి షోస్ అంటే ఓ పది నిమిషాలు.. మహా అయితే ఓ పావుగంట పాటు మాత్రమే కనిపిస్తాడు. అందులో చాలావరకూ ఇతర కంటెస్టెంట్స్ పాలుపంచుకుంటారు. అంచేత మనోడి ఫేస్ ఎక్కువగా కనిపించదు. అలాంటి వాళ్లు రెండున్నర గంటల పాటు సినిమాలో కనిపిస్తే చూసి భరించడం ప్రేక్షకుల వల్ల అవుతుందా..? కాదని ఆల్రెడీ ప్రూవ్ అయినా మనోడు ఈ సారి ఓ యాక్షన్ ఎంటర్టైనర్ తో వస్తున్నాడు. సినిమా టైటిల్ కూడా తన బుల్లితెర ఇమేజ్ ను ప్రతిబింబించేలా ‘గాలోడు’అని పెట్టారు.

Advertisement

లేటెస్ట్ గా గాలోడు మూవీ టీజర్ విడుదల చేశారు. టీజర్ చూస్తే.. సుడిగాలి సుధీర్ తనను తాను చాలా ఎక్కువగా ఊహించుకునే ఈ కథకు ఓకే చెప్పినట్టు తెలుస్తోంది. ఆల్రెడీ మాస్ హీరోగా ఎస్టాబ్లిష్ అయిన వాళ్లు చేసిన స్థాయిలో యాక్షన్ స్టంట్స్, భారీ డైలాగులు, బిల్డప్పులూ అబ్బో శానా ఉన్నాయి కతలు. ఇట్టాంటివి చూసినప్పుడే పాపం రాబోయే రోజుల్లో మనోడి పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకునేందుకు ఆస్కారం వస్తుంది. ఈ టీజర్ చూశాక ఖచ్చితంగా సుధీర్ తన వాపును చూసి బలుపు అనుకుంటున్నాడు అని మాత్రం ఖచ్చితంగా చెప్పొచ్చు.
అలాగని అతని శ్రమను, ప్రతిభను తక్కువ చేయడం కాదు ఇక్కడ. తన ఇమేజ్ ను వదులుకుని ఇలా యాక్షన్ స్టార్ లా బిల్డప్ ఇస్తే మరో సునిల్ అవుతాడు. సునిల్ అయినా బిగ్గెస్ట్ స్పాన్ ఉన్నవాడు కాబట్టి తట్టుకుని మళ్లీ నిలబడ్డాడు. సుధీర్ కు అంత లేదు కదా..? తన ఇమేజ్ కు తగ్గ కథలతో సినిమాలు చేస్తే ఒకటి కాకపోయినా మరోటి ఆకట్టుకుంటుంది. అలా కాదని ఏకంగా మాస్ హీరోలా బిల్డప్ ఇస్తే అసలుకే మోసం వస్తుంది.

Advertisement

Post Comment