నింగికెదిగిన తార! నేలరాలిన తారజువ్వ!

ఆమె ఒక అందమైన స్వప్నం.. ఆమె ఒక విషాదాంతం.. ప్రపంచానికి మత్తుని పంచి తాను మాత్రం చిత్తైపోయింది. డిసెంబర్ 2.. సిల్క్ స్మిత జయంతి. సిల్క్ స్మిత హీరోయిన్ కాదు.. కానీ, అప్పట్లో ఆమె హీరోయిన్స్ కంటే తక్కువేం కాదు. నిజానికి… సిల్క్ ఒక దశలో హీరోయిన్స్ కంటే కూడా ఎక్కువ పాపులారిటీ ఎంజాయ్ చేసింది. సిల్క్ స్మిత అసలు పేరు విజయలక్ష్మి. ఆమె వరుస విజయాల్ని చవిచూస్తూ వివిద భాషల్లోని కుర్రకారును హుషారులో ముంచేసింది.

1979లో విడుదలైన ఓ తమిళ సినిమాలో ఆమె ‘సిల్క్’ అనే పాత్ర చేసింది. అలా ‘సిల్క్ స్మిత’గా భారతీయ సినీ చరిత్రలో తానో వయ్యారాల ఒంపుసొంపుల అధ్యాయమైపోయింది. సిల్క్ తళుకుల వెనుక కూడా అలాంటి ఓ భగ్గునమండే వ్యక్తిగత జీవితం ఉంది. సిల్క్ స్మితను తన మేనజరే తీవ్రంగా మోసం చేశాడంటారు. అందంగా కనిపించే గ్లామర్ ప్రపంచపు తోలు మందం స్వార్థ మనస్తత్వాలకు.. సిల్క్ జీవితం ఒక ఉదాహరణ. అనేక మానసిక, ఆర్ధిక కారణాలతో సిల్క్ 1996 సెప్టెంబర్ 23న 35ఏళ్లకే జీవితం చాలించింది. నటిగా గెలిచి కూడా ఒక అమ్మాయిగా ఓడిపోవాల్సి వచ్చింది.

Related Posts