ప్రభాకర్ తో పెళ్లికి రెడీ అంటున్న శ్రీముఖి

బుల్లితెరపై విపరీతమైన ఫాలోయింగ్ ఉన్న స్టార్ యాంకర్స్ లో శ్రీముఖి ఒకరు. అందంతో పాటు చలాకీతనం, వాక్చాతుర్యంతో అందరినీ ఆకట్టుకునే శ్రీముఖి.. ఇటీవలే తన పెళ్లి గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. నాలుగు పదుల వయసులోకి అడుగు పెట్టిన శ్రీముఖి ఇంత వరకు పెళ్లి చేసుకోలేదు. గతంలో తనకు ఓ లవర్ ఉండేవాడని అతనితో బ్రేకప్ అయిందని అప్పట్లో చెప్పింది.


ఇటీవల ఓ ఇంటర్యూలో తన వయసు పెరుగుతోందని.. పెళ్లికి సంబంధించిన ప్రశ్నలు కూడా ఎదురవుతున్నాయని.. అయితే.. నీ రంగంలో నీవు సక్సెస్ ఫుల్ గా ముందుకెళ్తున్నావు.. అలాగే.. నీకు చేసుకోవాలనుకున్నప్పుడు పెళ్లి చేసుకో అని తన తల్లిదండ్రులు తనకు స్వేచ్ఛను ఇచ్చినట్టు చెప్పింది.

ఇక.. లేటెస్ట్ గా ‘ఆదివారం విత్ స్టార్ మా పరివారమ్‘ ప్రోగ్రామ్ లో ‘కృష్ణా ముకుంద మురారి‘ సీరియల్ టీమ్ తో స్పెషల్ ఎపిసోడ్ చేసింది శ్రీముఖి. ఈ ఆదివారం ఉదయం 11 గంటలకు ప్రసారమయ్యే ఈ ఎపిసోడ్ లో మరోసారి శ్రీముఖి పెళ్లి ప్రస్తావన వచ్చింది. లేటెస్ట్ గా అందుకు సంబంధించి ప్రోమో రిలీజయ్యింది.

ఈ ఎపిసోడ్ ప్రోమో స్టార్ట్ అవ్వగానే.. ‘నేను గుర్తొచ్చానా? మా షో గుర్తొచ్చిందా?‘ ఇలా వచ్చారు అన్నట్టు ప్రభాకర్ ని అడిగింది యాంకర్ శ్రీముఖి. అసలు ‘నువ్వు గుర్తురాని మగాడెవరైనా ఉన్నారా ఈ ప్రపంచంలో.. అంటూ నీతో ఓ చిన్న విషయం చెబుదామని..‘ అని ప్రభాకర్ అంటే.. ‘ఓ మై గాడ్ ప్రభాకర్ గారికి మళ్లీ పెళ్లి..‘ అంటోంది. ‘శ్రీముఖి అందుకే ముందు నువ్వు పెళ్లి చేసుకో అంటాడు‘ ప్రభాకర్. వెంటనే.. ‘మరి నేను రెడీ.. మీరు రెడీయా‘ అని ప్రభాకర్ నే అడిగేసింది శ్రీముఖి.

పైగా.. ఈ ఎపిసోడ్ లో బుల్లితెర మెగాస్టార్ ప్రభాకర్ పై తనకు క్రష్ ఉందని.. అతని భార్య ముందే చెప్పేసింది శ్రీముఖి. ఇదంతా ఎంటర్ టైన్ మెంట్ కోసం చేసినా.. ఈ ప్రోగ్రామ్ తో మరోసారి మరోసారి శ్రీముఖి పెళ్లి టాపిక్ అంతటా హాట్ టాపిక్ గా మారింది.

Related Posts