దుల్కర్ తో సమంత రొమాన్స్ ..

లెఫ్టినెంట్ రామ్ గా ప్రస్తుతం తెలుగు ఆడియన్స్ ను మెస్మరైజ్ చేస్తున్న స్టార్ దుల్కర్ సాల్మన్. దుల్కర్ కు సౌత లోనే కాక నార్త్ లోనూ మంచి క్రేజ్ ఉందన్న విషయం అందరికీ తెలుసు. ఆ క్రేజ్ ను డైరెక్ట్ గా ఆయా భాషల్లో సినిమాలు చేస్తూ మరింత పెంచుకుంటున్నాడు దుల్కర్. మహానటి తర్వాత మనోడికి ఎంత మంది ఫ్యాన్స్ అయ్యారన్నది ఇప్పుడు సీతారామం ప్రమోషన్స్ లో చూస్తే తెలుస్తుంది. అలాంటి దుల్కర్ త్వరలోనే క్రేజీ లేడీ సమంతతో రొమాన్స్ చేయబోతున్నాడు. యస్.. ఊహించని ఈ కాంబినేషన్ లో మాలీవుడ్ లో ఓ సినిమా రాబోతోంది.

మొదటి నుంచి తెలుగు, తమిళ్ మార్కెట్ పైనే ఫోకస్ చేసింది సమంత. ఆ మేరకు రెండు భాషల్లోనూ టాప్ లేపింది. ప్రస్తుతం బాలీవుడ్ లో అడుగులు మొదలుపెట్టింది. ఇటు తెలుగులోనూ మరుసగా సినిమాలున్నాయి. ఈ టైమ్ లో తనకు మాలీవుడ్ ఆఫర్ రావడంలో వింతేముందీ. అక్కడ అభిలాష్ జోషీ డైరెక్షన్ లో కింగ్ ఆఫ్‌ కోత అనే సినిమాకు సైన్ చేశాడు దుల్కర్. ఇది ఓ గ్యాంగ్ స్టర్ కథాంశంతో వస్తోన్న చిత్రం. ఈ కథ సమంతకు చెప్పగా తను కూడా స్క్రిప్ట్ విన్న తర్వాత ఓకే చెప్పిందంటున్నారు. త్వరలోనే ఈ కాంబోకు సంబంధించిన అఫీషియల్ న్యూస్ వస్తుంది. దుల్కర్, సమంత.. ఇద్దరూ ఏ పాత్రైనా చేయగల మోస్ట్ టాలెంటెడ్. అలాంటి వారి కాంబోలో సినిమా అంటే ఆడియన్స్ కు పండగే కదా..?

Related Posts