రవితేజ ఖాతాలో మరో దర్శకుడు

ఏ ఇండస్ట్రీ అయినా ప్రతి హీరో కోరుకునే ఇమేజ్.. మాస్.. యస్.. మాస్ ఇమేజ్ ఉంటేనే బాక్సాఫీస్ ఫిదా అవుతుంది. ఓపెనింగ్స్ తో పాటు.. ఆడియన్స్ లో తిరుగులేని క్రేజ్ నూ తెచ్చేదీ మాస్ ఇమేజే. అలాంటి ఇమేజ్ నే ఇంటిపేరుగా మార్చుకున్నాడు రవితేజ. మాస్ మహరాజాగా అభిమానులు పిలుచుకుంటోన్న రవితేజ నుంచి కొన్నాళ్లుగా డిజాస్టర్స్ వస్తున్నాయి. బట్ అప్పుడప్పుడూ వస్తోన్న హిట్లు ఈ మాస్ రాజాకు వరుస ఆఫర్స్ తెస్తున్నాయి. ఇప్పటికే మూడు సినిమాలున్న మాస్ రాజా అకౌంట్ లోకి మరో ప్రాజెక్ట్ వచ్చిందిప్పుడు.

రవితేజ నుంచి ఓ సినిమా వస్తోందంటే మినిమం గ్యారెంటీ అనుకున్నారు ఒకప్పుడు. అప్పట్లో ప్రొడ్యూసర్స్ కూడా అతని వెంట క్యూ కట్టింది అందుకే. బట్ ఇప్పుడు అతని సినిమా అంటే మాగ్జిమం విసుగెత్తిస్తోంది. ఇప్పుడూ నిర్మాతలూ అలాగే ఉన్నారు. అందుకు కారణం మాస్ రాజా సినిమాకు హిట్ టాక్ వస్తే బ్లాక్ బస్టర్ గా టర్న్ అవుతుంది. కమర్షియల్ గా వర్కవుట్ అవుతుంది. అందుకే ఇన్ని ప్రాజెక్ట్స్ వస్తున్నాయి. ప్రస్తుతం టైగర్ నాగేశ్వరరావు, రావణాసుర, ధమాకా చిత్రాలు చేస్తున్న మాస్ రాజా లేటెస్ట్ గా మరో డైరెక్టర్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. బట్ ఇతను కొత్తవాడేం కాదు. స్టార్ డైరెక్టర్ కావాలన్న లక్ష్యంతో అడుగుపెట్టినా..

తర్వాత తడబడిన దర్శకుడు శ్రీవాస్. లక్ష్యం, లౌక్యం, డిక్టేటర్ వంటి చిత్రాలతో మాస్ తో పాటు క్లాస్ ను కూడా మెప్పించగలనని ప్రూవ్ చేసుకున్నాడు శ్రీవాస్. చివరగా బెల్లంకొండ శ్రీనివాస్ తో చేసిన సాక్ష్యం పోయింది. ప్రస్తుతం గోపీచంద్ తో సినిమాకు సిద్ధమవుతున్నాడు శ్రీవాస్. ఈ టైమ్ లోనే మాస్ రాజాకు సరిపోయే కథ చెప్పాడట. రవితేజ ఓకే చేశాడు అంటున్నారు. అయితే రవితేజ తన మూడు సినిమాలను, ఇటు శ్రీవాస్ గోపీచంద్ సినిమాను పూర్తి చేసిన తర్వాత ఈ కాంబినేషన్ లో సినిమా పట్టాలెక్కబోతోంది. ఏదేమైనా రవితేజ దూకుడు మాత్రం తగ్గడం లేదు.

Related Posts