నయనతారే నెంబర్ వన్

ఒక హీరోయిన్ లేదా హీరో నెంబర్ వన్ అని చెప్పేదేంటీ.. అంటే హిట్లు, కలెక్షన్స్ అంటారు చాలామంది. దానితో పాటు రెమ్యూనరేషన్ కూడా ఈ నెంబన్ వన్ ర్యాంకింగ్ లో కీలకం అవుతుంది. అలా ఇప్పుడు ఇండియాలోని టాప్ హీరోయిన్లలో ఒకరుగా చేరిపోయింది నయనతార. రెమ్యూనరేషన్ పరంగా బాలీవుడ్ భామలు టాప్ ప్లేస్ లో ఉంటారు. నయన్ వారిని కూడా వెనక్కి నెట్టింది. దీంతో తన రెమ్యూనరేషన్ ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది. ఇంతకీ పుచ్చుకుంటోన్న పారితోషికం ఎంత..?


లేడీ ఓరియంటెడ్ సినిమాలతో ఓ మీడియం రేంజ్ హీరో స్థాయిలో ఇమేజ్ తెచ్చుకుంది నయనతార. చాలాయేళ్ల క్రితమే కెరీర్ స్టార్ట్ చేసిన నయన్ లాంటి కెరీర్ ఇండియాలో ఇంకే నటికీ లేదంటే అతిశయోక్తి కాదు. అన్ని విషయాల్లో హాట్ టాపిక్ గా ఉంది. రీసెంట్ గా పెళ్లి చేసుకున్న నయన్ సినిమాలు మాత్రం తగ్గించలేదు. లేడీ ఓరియంటెడ్ కథలతో పటు రెగ్యులర్ హీరోయిన్ రోల్స్ కూ రెడీ అంటోంది. పైగా తనకు చాలా చాలా క్రేజ్ ఉంది. దీంతో సెలెక్టివ్ స్టోరీస్ తో సత్తా చాటుతోన్న నయన్ లేటెస్ట్ గా ఓ మూవీ కోసం తీసుకుంటోన్న రెమ్యూనరేషన్ సౌత్ తో పాటు బాలీవుడ్ లోనూ హాట్ టాపిక్ గా మారింది.


ఒక్కో దర్శకుడికి ఒక్కో హీరోయిన్ ఫేవరెట్ గా ఉంటుంది. తమిళ్ టాప్ డైరెక్టర్స్ లో ఒకడైన అట్లీకీ నయన్ అంటే అంతే ఇష్టం. తన ఫస్ట్ మూవీలో నయన్ చేయడం వల్లే అంత పెద్ద హిట్ అయిందని అతను బలంగా నమ్ముతాడు. అందుకే ప్రతీ ప్రాజెక్ట్ లోనూ నయన్ ఉండేలా చూసుకుంటాడు. ప్రస్తుతం అతను బాలీవుడ్ లో షారుఖ్ ఖాన్ తో సినిమా చేస్తున్నాడు. ఈ మూవీలోనూ నయనే ఉండాలని పట్టుబట్టాడు. షారుఖ్ ప్రస్తుతం డిజాస్టర్స్ లో ఉన్నాడు కాబట్టి దర్శకుడి మాట వినక తప్పలేదు. ఇదే ఛాన్స్ అనుకుందేమో నయన్ ఏకంగా 15కోట్లు రెమ్యూనరేషన్ డిమాండ్ చేసింది. ముందు అవాక్కయినా.. ఆమె వల్ల సౌత్ మార్కెట్ లో చాలా ప్లస్ అవుతుంది ఓకే చెప్పారు మేకర్స్. నయనతార కంటే ముందు ఇంకెవరూ 15కోట్ల పారితోషికం తీసుకోలేదా అంటే కేవలం దీపికా పదుకోణ్ మాత్రమే ఉంది.

బట్ తను థియేటర్స్ తో పాటు ఓటిటి కలిపి ఆ మొత్తం తీసుకుందీ అంటారు. అలియాభట్ కూడా 15కోట్లు తీసుకుంది. ప్రస్తుతం తెలుగులో ప్రాజెక్ట్ కె మూవీ చేస్తోన్న దీపికకు 18కోట్లు ఇస్తున్నారు అనే వార్తలు వచ్చాయి కానీ అందులో నిజం లేదంటున్నారు. ఇక ఎప్పట్లానే కంగనా తన రేట్ 20కోట్ల పైన అని చెబుతుంది. బట్ ఆమెకు ఇచ్చేది కేవలం 8 -10 కోట్లు మాత్రమే. ఇక మిగిలిన బాలీవుడ్ టాప్ బ్యూటీస్ అంతా 10 -12కోట్ల మధ్య ఉన్నారు. బట్.. వెళ్లిన ఫస్ట్ మూవీకే అందరికంటే బిగ్ చెక్ అందుకుంటోందంటే నయన్ క్రేజ్ ఏ రేంజ్ లో ఉందో అర్థం కావడం లేదూ.. సో ఇక మన సౌత్ హీరోయిన్లు బాలీవుడ్ లో హల్చల్ చేయబోతున్నారన్నమాట.

Related Posts