అనుకున్నంతా అయింది.. పుష్ప కు షాక్ ఇచ్చిన బుడ్డోడు

ఐకన్ స్టార్ అల్లు అర్జున్ పుష్పకు ఊహించినట్టుగానే ఓవర్శీస్ లో షాక్ ఎదురైంది. ఊహించారు కానీ.. మరీ ఈ రేంజ్ లో షాక్ తగులుతుందనుకుని ఉండరు. ఈ నెల 17న విడుదల కాబోతోన్న పుష్పకు ప్రీ రిలీజ్ సేల్స్ గా ఇప్పటికే 350 డాలర్స్ కలెక్ట్ అయ్యాయని గర్వంగా ప్రకటించుకుంది మూవీ టీమ్. అయితే అమెరికా, ఆస్ట్రేలియా దేశాల్లో ప్రివ్యూ షోస్ వేయడం ఆనవాయితీ. ఈ మేరకు వీళ్లు కూడా ప్రీ వ్యూస్ ను ప్లాన్ చేసుకున్నారు. చూడ్డానికి ప్రేక్షకులను సిద్ధంగానే ఉన్నారు. కానీ థియేటర్స్ లేవు. అంత పెద్ద దేశాల్లో థియేటర్స్ అన్నీ ఏమయ్యాయి అనుకుంటున్నారా.. సింపుల్.. అన్ని థియేటర్స్ ను స్పైడర్ మేన్ ఆక్యుపై చేశాడు. యస్.. అదే రోజు విడుదల కాబోతోన్న స్పైడర్ మేన్ సినిమా ప్రీ వ్యూస్ కే అన్ని థియేటర్స్ ను కేటాయించారట. దీంతో మరీ అతి తక్కువ సంఖ్యలో థియేటర్స్.. అది కూడా తెలుగు జనానికి దూరంగా ఉన్న స్క్రీన్స్ ను కేటాయించారట. ఆ స్క్రీన్స్ లో కేవలం తెలుగు వెర్షన్ సినిమాను మాత్రమే ప్రదర్శిస్తారన్నమాట. అంటే ఇండియా నుంచి ఇతర భాషల్లో ఉన్న అల్లు అర్జున్ ఫ్యాన్స కు వారి భాషల్లో అక్కడ సినిమా చూసే అవకాశం లేకుండా పోయింది.
ఇటు తెలుగు స్టేట్స్ లో కూడా మల్టీ ప్లెక్స్ ల్లో స్పైడర్ మేన్ హవా బాగా ఉంది. అడ్వాన్స్ బుకింగ్స్ లోనూ అతనే సత్తా చాటుతున్నాడు. అయినా మన పుష్పరాజ్ సత్తా చాటొచ్చు. కానీ ఓవర్శీస్ లో మాత్రం ఆ ఛాన్స్ స్పైడర్ మేన్ ఇవ్వకపోవచ్చు.
పుష్పకు ఉన్న ఒకే ఒక్క హోప్ ఏంటంటే.. స్పైడర్ మేన్ కు ఫ్లాప్ టాక్ రావడం. అప్పుడే అక్కడ మరిన్ని థియేటర్స్ మన పుష్పరాజ్ కు వస్తాయి. లేదంటే రికార్డ్ స్థాయి వసూళ్లు అక్కడ సాధ్యం కాదు.

Related Posts