ప్ర‌భాస్ హీరోయిన్ బ్రెయిన్ చాలా షార్ప్ అబ్బా!

నెవ్వ‌ర్ బిఫోర్‌, ఎవ్వ‌ర్ ఆఫ్ట‌ర్ అన్న‌ట్టుంది ప్ర‌భాస్ హీరోయిన్ దిశాప‌టాని చేసే చేష్ట‌లు. మ‌రి ఆమె ప్లానింగ్ చూస్తే ఎవ్వ‌రికైనా దిమ్మాక్ ఖ‌రాబ్ కావాల్సిందే మ‌ళ్లా!ఆర‌డుగ‌ల అంద‌గాడు డార్లింగ్ ప్ర‌భాస్‌తో ఎంత మంది జోడీక‌ట్టారో తెలుసు క‌దా.. రీసెంట్‌గా అయితే సాహోలో శ్ర‌ద్ధా, ఆ త‌ర్వాత ఆదిపురుష్‌లో కృతిస‌న‌న్‌, ప్రాజెక్ట్ కెలో దీపిక ప‌దుకోన్‌… జంట క‌ట్టేశారు క‌దా. అయితే వారెవ‌రికీ రాని ఓ ఐడియా దిశాప‌టానికి వ‌చ్చింది. రావ‌డ‌మే ఆల‌స్యం ఇంప్లిమెంట్ చేసేసింది.

నార్త్ సుంద‌రీమ‌ణులు మ‌న సినిమాకు సైన్ చేస్తే ఒక‌ప్పుడు మ‌న‌క‌ది గొప్ప‌. ఇప్పుడు సౌత్ ప్రాజెక్టులు చేస్తున్నాం అని అక్క‌డి స‌ర్కిల్స్ లో చెప్పుకోవ‌డం వాళ్ల‌కే గొప్ప‌. అందుకే క‌చ్చితంగా ఒక‌టైనా సౌత్ సినిమా ఉండేలా కాల్షీట్లు అడ్జ‌స్ట్ చేసుకుంటున్నారు ముంబై భామ‌లు.అయితే మిగిలిన వాళ్లంద‌రూ ఒక‌దాని త‌ర్వాత ఇంకోటి అంటూ సినిమాలు చేస్తుంటే, దిశ ప‌టాని మాత్రం నాకు కాస్త స్పీడ్ ఎక్కువ‌లే అన్న‌ట్టు వ్య‌వ‌హ‌రిస్తోంది.

ఆల్రెడీ ప్రాజెక్ట్ కెలో డార్లింగ్ ప‌క్క‌న ట్రెమండ‌స్ రోల్ చేస్తోంది దిశా ప‌టాని. ఆ సినిమా ఇంకా షూటింగ్ స్టేజ్‌లోనే ఉంది. అంత‌లోనే ఆమె సూర్య సినిమాకి సైన్ చేసింది. కె.ఇ.జ్ఞాన‌వేల్ రాజా, యువీ క్రియేష‌న్స్ క‌లిసి చేస్తున్న సినిమాలో హీరోయిన్‌గా దిశా ప‌టానిని ఫిక్స్ చేశారు.


ఆల్రెడీ వ‌రుస హిట్ల‌తో హై మీదున్నాడు సూర్య‌. ఇప్పుడు దిశ‌ప‌టాని హీరోయిన్‌గా న‌టిస్తున్న ఈ సినిమాను రెండు పార్టులుగా తీస్తార‌నే టాక్ ఎటూ న‌డుస్తోంది. దీన్నిబ‌ట్టి, ఇప్పుడు దిశ చేతిలో వ‌రుస‌గా మూడు సౌత్ రిలీజులున్నాయి.తెలుగు సినిమా లోఫ‌ర్‌తో సిల్వ‌ర్ స్క్రీన్‌కి ఇంట్ర‌డ్యూస్ అయిన దిశాప‌టాని ఇప్పుడు నార్త్ లో రూలింగ్ హీరోయిన్‌.

Related Posts